MBNR – వంద శాతం మొక్కలు నాటి జిల్లాలో పచ్చదనాన్ని పెంచాలి – రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

@ వంద శాతం మొక్కలు నాటి జిల్లాలో పచ్చదనాన్ని పెంచాలి
@ సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోండి
@ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ తో పాటు నైపుణ్యాల అభివృద్ధి కై శిక్షణ -రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
                 గురువారం వర్చువల్ పద్దతిలో నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.

                  జిల్లాలో వంద శాతం మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్ పెంచాలని,అన్ని గ్రామాలలో ఆయా శాఖల అధికారులు నూటికి నూరుశాతం హరితహారం కింద మొక్కలు నాటాలని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని మంత్రి అన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బి రహదారులు, వాటి నిడివి నాటిన మొక్కలు, బ్రతికిన మొక్కలు,మొక్కల మధ్య దూరం వంటి అన్ని వివరాలు సేకరించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు నర్సరీ ల నుండి పెద్ద పెద్ద మొక్కలను తెచ్చి రహదారులకు ఇరువైపుల నాటాలని అన్నారు. రోడ్ల కు దూరంగా మొక్కలు నాటాలని, లేనట్లయితే రోడ్డు విస్తరణ సమయంలో చెట్లు కొట్టేయాల్సి వస్తుందని అన్నారు. నాటిన మొక్కల రికార్డును కూడా నిర్వహించాలని, గ్రామాలలో ప్రతి ఇంటికి 5 మొక్కలు ఇచ్చి నాటించాలని తద్వారా జిల్లాలో తప్పనిసరిగా గ్రీన్ బెల్ట్ పెంచాలని, ప్రతి మండల, జిల్లా కార్యాలయంలో మొక్కలు నాటడం తో పాటు నర్సరీలు అభివృద్ధి చేయాలని అన్నారు.
                  రైతులను డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్ళించాలని, ముఖ్యంగా పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున పత్తి వైపు మళ్ళించాలని చెప్పారు . వ్యవసాయ అధికారులు రైతు వేదికల లోనే ఉండాలని, ఉదయమే క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
                  డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా గ్రామాలలో విస్తృత ప్రచారం చేపట్టాలని, ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలల్లో ఎక్కడైనా తాగునీటి పైపులు లీకేజీ ఏర్పడితే వెంటనే వాటిని అరికట్టాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు నల్లా గుంతలు శుభ్రం చేయించాలని మంత్రి సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంత మంది రోగులు వస్తున్నారు? తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారి వివరాలను సేకరించాలని,అలాగే బి పి సుగర్ రోగుల వివరాలు కూడా తీసుకోవాలని, ప్రభుత్వ,ప్రైవేట్ అన్ని ఆసుపత్రుల నుండి వివరాలు సేకరించాలని, ఆదే విధంగా మున్సిపాలిటీలు ,గ్రామ పంచాయతీల ద్వారా కూడా ఈ వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలని, రోగాల కారణంగా మనుషుల ప్రాణాలు పోవడానికి వీలు లేదని అన్నారు .
                  కోవిడ్ వల్ల అనాధలైన పిల్లల వివరాలను సేకరించాలని , అలాంటి పిల్లలకు చిన్నప్పటి నుండి బాలికలకు, బాలురకు విడివిడిగా హాస్టల్ వసతి తో పాటు విద్యను అందించి పెద్దయిన తర్వాత నైపుణ్యాల ను అభివృద్ధి చేసి శిక్షణ ఇవ్వాలని మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఉద్యోగాల నియామకాల నిమిత్తం ఇవ్వనున్న నోటిఫికేషన్ లను దృష్టి లో ఉంచుకొని జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు గ్రూప్ 1, గ్రూప్ 2 కు,అదేవిధంగా కానిస్టేబుల్,ఇతర ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.ప్రతి రిక్రూట్ మెంట్ కు ముందగానే కోచింగ్ ఇవ్వాలని సూచించారు.

                   మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో చెరువుల కబ్జాలు, ఆక్రమణలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి సూచించారు.
                   ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయంతో కృషి చేస్తే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.

                   జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జెడ్ పి టి సి లు , ఎంపిపిలు స్సర్వ సభ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి సహకారం అందించి జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు .
జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు మాట్లాడారు.
                   ఆయా అంశాల పై జరిగిన చర్చ సందర్భంగా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ,సబ్ సెంటర్లలో పాముకాటు మందును, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని, గ్రామాలలో 60 సంవత్సరాలు దాటిన వారికి హెల్త్ క్యాంపులు నిర్వహించాలని , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమస్యలను తీర్చాలని , ఆన్లైన్ ద్వారా అందిస్తున్న విద్య అందరికీ అందేలా చూడాలని , మూతపడిన పాఠశాల ను గుర్తించి ఉపయోగంలోకి తీసుకురావాలని, విద్యుత్ కనెక్షన్లకు డి డి లు కట్టిన వారికి తక్షణమే కనెక్షన్లు ఇవ్వాలని కోరారు.
                   పౌరసరఫరాలు ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సంక్షేమ, పల్లె ప్రగతి, విద్యుత్తు తదితర అంశాలపై ఈ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు .
                   ఎం ఎల్ సి వాణి దేవి, జెడ్ పి వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్ పి టి సి లు, ఎంపీపీలు ,ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు .

Smt. Swarna Sudhakar Reddy, Chairperson, Zilla Praja Parishad, Mahabubnagar.

Share This Post