MBNR – వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు కోరారు.

వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు కోరారు.
శుక్రవారం అయన మహబూబ్ నగర్ మున్సిపల్ పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
పాల్ సాబ్ గుట్ట ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇళ్లిళ్ళు తిరిగి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి వస్తున్నారా ? వస్తే ఎలాంటి విషయాలు చెప్తున్నారు ? ప్రత్యేకించి పారిశుధ్యం గురించి వివరిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గృహా యజమానులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా మురికి కాలువల్లో మురుగు నీరు సులభంగా వెళ్లేందుకు చెత్తా,చెదారం వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు మురికి కాలువలలోని చెత్తను తొలగిస్తే మురుగు నీరు సులభంగా వెళుతుందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా మున్సిపల్ సిబ్బంది వార్డులన్నీ, ఇళ్లిళ్ళు తిరుగుతున్నారని,మీ పాఠశాలకు కూడా మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చారా ?వస్తే ఏలాంటి విషయాలు చెప్పారని ఆరాతీశారు.
జిల్లా కలెక్టర్ వెంట మాజీ కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.

 

 

 

Share This Post