MBNR – వానా కాలం ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.

వానా కాలం ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో దాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా ఓ బి ఎం ఎస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే వారి అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడంలో ట్రాన్స్ పోర్ట్ సమస్య రాకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు ట్రాన్స్పోర్ట్ కాంటాక్టర్ భరించాలని, రైతుల పై ఎలాంటి చార్జీలు వేయవద్దని, గన్ని బ్యాగులు కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.టాటూహు పేరుతో కిలో మించి తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు. వ్యవసాయ, పౌర సరఫరా, రెవెన్యూ అధికారులు అందరూ ఇది వరకే ఆదేశించినట్లు గా ప్రతి రోజు దాన్యం కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ఏదైనా సమస్య ఉంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. ధాన్యం రవాణాకు సంబంధించి లారీల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
దాన్యం కొనుగోలు సక్రమంగా నడిచేందుకు వ్యవసాయ, డిఆర్డిఓ, సహకార, పౌరసరఫరాల శాఖ అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన చెప్పారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, వ్యవసాయ అధికారి ని సుచరిత ,డిఆర్డిఓ యాదయ్య ,డి సి ఓ సుధాకర్ ,డి ఎస్ ఓ వనజాత, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగదీష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post