MBNR – విద్యార్థులు బాగా కష్ట పడి చదివి పాలమూరు పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

విద్యార్థులు బాగా కష్ట పడి చదివి పాలమూరు పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.
బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో 15 సంవత్సరాలు పూర్తయిన వారికి వేస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
కరోనా వైరస్ బారిన పడకుండా 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని హెడ్మాస్టర్ ను ఆదేశించారు. ఎవరికైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారు మాత్రం తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ కు సూచించారు. దేశంలో 130 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అందువల్ల విద్యార్థులు భయపడకుండా తప్పనిసరిగా అందరూ వాక్సిన్ వేసుకోవాల్సిందిగా కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని,కూరగాయలను పరిశీలించారు.
పదవ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో గణితం పై ప్రాథమిక సూత్రాలకు సంబంధించిన వివరాలను విద్యార్థుల ద్వారా అడిగి రాబట్టారు. విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి పాలమూరు పేరును నిలబెట్టాలని, విద్య, వైద్యం అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జిల్లా ఎంతో అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో రహదార్ల విస్తరణ , రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద మొక్కలను నాటడం జరిగిందని అన్నారు.
అంతకుముందు ఆయన మన జిల్లా మంత్రి ఎవరని ?ఏ శాఖలు చూస్తారని అడుగగా డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అని,ఎక్సైజ్,టూరిజం శాఖల మంత్రి అని విద్యార్థులు బదులిచ్చారు.
పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊర్మిలను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాల ఆవరణ పెద్దగా ఉన్నందున హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఊర్మిళ ,ఇతర ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

 

 

 

 

 

Share This Post