MBNR – విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ విషయాలపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.

విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ విషయాలపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.
సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ ఇప్పటివరకు కరోనా ఉన్న కారణంగా ఆయా అంశాలపై నేరుగా సమీక్షలు నిర్వహించలేదని అన్నారు. ఇకపై అన్ని అంశాలపై పూర్తి సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా విద్య,వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ఆయా శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సంసిద్ధులు కావాలని చెప్పారు. ఆయా వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి గాను పెండింగ్లో ఉన్న స్థల సేకరణ పై కలెక్టర్ సమీక్షించారు. తక్షణమే స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పై కూడా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడిస్తూ, ఇందుకుగాను జిల్లా అధికారులు వారికి సంబంధించిన నోట్ సమర్పించాలని తెలిపారు .ముఖ్యమంత్రి ఫిర్యాదులు, ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు స్వీకరించిన కళావతిని జిల్లా స్థాయి అవార్డుతో పాటు, మెడల్ను బహుకరించారు. శాలువాతో సత్కరించారు.
అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్,కె. సీతారామారావు, డి ఆర్ ఓ కె.స్వర్ణలత, జెడ్ పి సి ఈ ఓ జ్యోతి ,ఆర్డిఓ పద్మ శ్రీ , జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.

 

Share This Post