MBNR – వ్యాక్సినేషన్ లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.

వ్యాక్సినేషన్ లో స్వయం సహాయక మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు.
సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వాక్సినేషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వైద్యాధికారులు రెండవ డోసు పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, జిల్లాలో నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని చెప్పారు. ఇందుకుగాను ఆశ ,అంగన్వాడి ఏ ఎన్ ఎం లు, ఇల్లిల్లు తిరిగి వ్యాక్సినేషన్ వేసుకొనని వారిని గుర్తించి వాక్సినేషన్ వేయాలని చెప్పారు.ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ఆధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. డిఎంహెచ్ ఓ, డిప్యూటీ డిఎంహెచ్ ఓ లు ఎప్పటికప్పుడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్షించాలని అన్నారు.
వాక్సినేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసేందుకు గాను తనతో పాటు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖలోని సీనియర్ అధికారులు, జిల్లా అధికారులను కూడా తనిఖీ అధికారులుగా నియమిస్తామని కలెక్టర్ వెల్లడించారు .వాక్సినేషన్ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వాక్సినేషన్ లో వెనుకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డి ఎం హెచ్ ఓ డాక్టర్ కృష్ణ,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్,వైద్యాధికారులు,తదితరులు హాజరయ్యారు.

Share This Post