MBNR – శరవేగంతో పాలమూరు- రంగారెడ్డి రెడ్డి పునరావాస పనులు – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

                   @ శరవేగంతో పాలమూరు- రంగారెడ్డి రెడ్డి పునరావాస పనులు – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు
                   పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉదండాపూర్ పునరావాస పనుల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు
                   మంగళవారం ఆయన వివిధ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు,రైల్వే ప్రాజక్టులు, ఎత్తిపోతల పథకాల భూసేకరణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
                    పి ఆర్ ఎల్ ఐ కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల రూపాయలు మంజూరు చేసినందున ఆర్ అండ్ ఆర్ పనుల పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని,వెంటనే టెండర్లు పిలవాలని,రహదారుల నిర్మాణం చేపట్టాలని,ఇందుకుగాను ముందుగా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని,ఈ పనులన్నీ రెవెన్యూ అదనపు కలెక్టర్ దగ్గరుండి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
                    తాహసిల్దార్ ల నుండి లే -అవుట్లన్నీ వచ్చాయని, ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించి తక్షణమే టెండర్లు పిలవాలని అదేవిధంగా లే అవుట్ల సాఫ్ట్,హార్డ్ కాపీలు ఇచ్చిన అనంతరం ఆయా శాఖల అధికారులు వారికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలని ,ముఖ్యంగా రోడ్ల నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
                     ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ పనుల విషయమై ఈ నెల 18 న జడ్చర్లలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.
                    పాలమూరు- రంగారెడ్డి పనులు ఎక్కడ ఆగకుండా చూసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ,ఇంకా డి డి లు ప్రచురించాల్సి ఉంటే వెంటనే ప్రచురించాలనిఅన్నారు.
                    ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు, పి ఆర్ ఎల్ ఐ ఇంజనీర్లు రమేష్ , ఉదయశంకర్ , రెవెన్యూ అధికారులు, మండల తహసిల్దారులు,ఇతర సంబంధిత అధికారులు తదితరులు హాజరయ్యారు .

Share This Post