MBNR – సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావివ్వకూడదని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

                      సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావివ్వకూడదని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
                       శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 287 మంది లబ్ధిదారులకు సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
                       అంతేకాక ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
                       ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నిరుపేదలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు అప్పులు చేసేవారని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే నిరుపేదల పిల్లలకు లక్ష వెయ్యి 116 రూపాయలను ఇస్తున్నదని అన్నారు. శుక్రవారం ఒక్క రోజే 287 మందికి 3 కోట్ల రూపాయల విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
                        ప్రజల సంక్షేమం కోసం ఆసరా పింఛన్లు, ఆరు కిలోల బియ్యం ,ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నింటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆచార్య జయశంకర్ కల సాకారం అవుతున్నదని ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ సేవలను ఆయన కొనియాడారు.
                        సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఇవ్వకూడదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారందరికీ దశలవారీగా ఇండ్లు ఇస్తామని, లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని తెలిపారు.
                        జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఎస్పీ ఆర్ .వెంకటేశ్వర్లు,అదనపు కలెక్టర్లు కె.సీతారామారావు ,మున్సిపల్ చైర్మన్ కె.సి నరసింహులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post