MBNR – సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి. సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి. సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
ఒక రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న సఖి కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు మంజుల ద్వారా సఖి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు.
పొక్సో కేసులు, బాల్య వివాహాలను అరికట్టడం,గృహ హింస నిరోధం,భార్య భర్తల వివాదాలు, యుక్త వయసులో యువతులకు ఎదురయ్యే,ప్రేమ, టీజింగ్ వంటి సమస్యలపై సఖి ద్వారా ముందుగా అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా న్యాయం కోసం ఆర్థికంగా అడ్వకేట్ ను నియమించుకోలేని వారికోసం డీఎల్ ఎస్ ఏ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని, అడ్వకేట్ ని ఏర్పాటు చేయించాలని సూచించారు. ఫోక్సో కేసులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు తక్షణమే నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ,యువతీ యువకులు ప్రత్యేకించి కాలేజీ వయసులో ఉన్న వారు ప్రేమ ,తదితర వ్యవహారాల వల్ల ఇబ్బందులు పడకుండా సఖి,ఎం ఎస్ కె ద్వారా కళాశాలల్లో ముందస్తు అవగాహన కల్పించాలని చెప్పారు. అదేవిధంగా విద్యాశాఖ ద్వారా ఉన్నత తరగతి విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. గృహహింస కేసులు,వేదింపులు, వివిధ రకాల కేసులలో సఖి కేంద్రానికి వచ్చే బాధితులకు షెల్టర్ తో పాటు, వివిధ వృత్తి నైపుణ్యలలో అవసరమైన శిక్షణ ఇవ్వాలని ,ఆయా శాఖల ద్వారా రుణాలు ఇచ్చేఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పై అంశాలపై నిరంతరం కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు.
అంతకు ముందు కమిషన్ సభ్యులు మహబూబ్ నగర్ చేరుకోగానే జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు,ఎస్ పి.ఆర్.వెంకటేశ్వర్లు లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి కి,కమిషన్ సభ్యులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వసాగతం పలికారు.

మహిళా కమిషన్ సభ్యులు సాహీన్ ఆఫ్రిది, కె.ఉమాదేవి,జి పద్మ,ఎస్.లక్ష్మీ, రేవతి, ఆర్ డి ఓ పద్మశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ,తదితరులు ఉన్నారు.

Share This Post