సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేసే “అంబెడ్కర్ ఓవర్ సీస్ విధ్యానిది “పథకం కింద వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా వసథిగృహ సంక్షేమ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రానా అన్నారు.
మంగళవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సంక్షేమ అధికారులతో సమీక్షించారు.
అన్ని సంక్షేమ హాస్టళ్లలో హరితహారం కింద మొక్కలు నాటాలని,పెరటి తోటల పెంపకాన్ని చేపట్టాలని , రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం 32 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని, నూటికి నూరు శాతం ప్రతి హాస్టల్లో దోమలు కుట్టకుండా జాలిలు ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని , ప్రతి గదికి విద్యుత్ కనెక్షన్ ఉండాలని ,మురుగు నీరు సక్రమంగా వెళ్లేలా చూడాలని, అవసరమైతే ప్రతి హాస్టల్ కు 50 వేల నుండి లక్ష రూపాయలు అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ కింద వారం రోజుల్లో నిధులు ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ఇదివరకే ఉన్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులను వినియోగించాలని, ఔట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వాలని, అద్దే హాస్టళ్లకు రేట్లు నిర్ధారించి చెల్లించాలని, విద్యుత్ బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని, వీటన్నింటికీ వచ్చే 15 రోజుల్లో బడ్జెట్ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు .విదేశీ విద్యను అభ్యసించేందుకు అంబెడ్కర్ ఓవర్ సీస్ విద్య నిధి పథకానికి ప్రతి వసతి గృహ సంక్షేమాధికారి కనీసం ఒకరిని పంపించేలా చర్యలు తీసుకోవాలని, ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 657 మంది విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసిస్తున్నారని, ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి కేవలం 20 మంది విద్యార్థులు మాత్రమే విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న రని,ప్రతి జిల్లా నుండి కనీసం 15 మంది అయినా పంపించేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఇందుకుగాను పోస్టు మెట్రిక్ చదివిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి కలిసి వారిని చైతన్యం చేసి ఈ దిశగా ప్రోత్సహించాలని ఆదేశించారు. కల్యాణ లక్ష్మి కింద దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరితగతిన లబ్ధిదారులకు అందించేలా చూడాలని ,అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక సహాయం ఇవ్వడంలో జాప్యం చేయవద్దని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లకు సంబంధించి చార్జిషీట్ దాఖలు, పరిహారం ఇవ్వటం, చెల్లింపుల విషయంలో జాప్యం చేయవద్దని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె ఆయా జిల్లాల వారీగా పనితీరు లో ప్రతిభ కనబరిచిన వసతి గృహ సంక్షేమ అధికారులు,సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు, మహబూబ్ నగర్ జిల్లా డి డి యాదయ్య ను డైరీల తో సన్మానించారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా హాస్టల్లో మరమ్మతులు కోసం ప్రతి హాస్టల్ కు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని, దీంతో హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకుగాను ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాలో ఇంజనీర్లు, తహసీల్దార్లు ,ప్రత్యేక అధికారులతో వాక్ ఓవర్ సర్వే చేశామని , ఏ పనులు అవసరమో వాటిని చేపట్టడం జరిగిందని వెల్లడించారు.
సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ హైదరాబాద్ కార్యాలయం నుండి అడిషనల్ డైరెక్టర్ ఉమ, జాయింట్ డైరెక్టర్ హనుమంతు నాయక్,జే డి శ్రీనివాసరావు, సోషల్ వెల్ఫేర్ డిడి యాదయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల సంక్షేమ శాఖల ఏ ఎస్ డబ్ల్యు లు, వసతిగృహ సంక్షేమ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .