MBNR – సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రానా అన్నారు.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రానా అన్నారు.
మంగళవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ,కలెక్టర్ బంగ్లా చౌరస్తా వద్ద ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు .
ఈ సందర్భంగా ఆమె స్నానపు గదులు, తలుపులు, కిటికీలు, దోమలు కుట్టకుండా ఏర్పాటుచేసిన జాలీలు, హాస్టల్లో పరిసరాలు, మురుగు నీటి పారుదల సౌకర్యాలు తదితరాలను పరిశీలించారు.
జిల్లాలో ఎన్ని వసతిగృహాలు ఉన్నాయని డి డి యాదయ్య ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వసతి గృహంలో కిటికీలకు తప్పనిసరిగా దోమల మెస్ ఏర్పాటు చేయాలని, నూటికి నూరు శాతం ఉండేలా చూడాలని, హాస్టల్లో టాయిలెట్ కి నిరంతరం నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, బాత్రూం తలుపులు సవ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతి గదికి విద్యుత్ సౌకర్యం ఉండాలని, మురుగునీరు సవ్యంగా వెళ్లేందుకు పైప్ లైన్ లు ఉండాలని ఆదేశించారు .ప్రభుత్వ భవనాలలో నిర్వహిస్తున్న హాస్టల్ రూప్ పై నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.
బాలికల వసతి గృహం తనిఖీ సందర్భంగా 200 మంది విద్యార్థులకు 12 టాయిలెట్స్ ఉండగా మరికొన్నిటిని నిర్మాణం చేపట్టాలని, అవసరమైతే అదనపు నిధులు ఇస్తామని తెలిపారు. అంతేకాక విద్యార్థినిలు బట్టలు వేసుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ,మొదటి అంతస్తులో స్టడీ రూమ్ కోసం ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు .
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ హనుమంతు నాయక్ ,డిఈ రాములు,ఏ ఈ వెంకటరెడ్డి ,సోషల్ వెల్ఫేర్ డిడి యాదయ్య,వసతి గృహ సంక్షేమ అధికారులు శివ, మాధవి రెడ్డి తదితరులు ఉన్నారు .

Share This Post