MBNR – సినిమా హీరో ఆర్ నారాయణ మూర్తి నిర్మించిన రైతన్న సినిమా నిజానికి దగ్గరగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సినిమా హీరో ఆర్ నారాయణ మూర్తి నిర్మించిన రైతన్న సినిమా నిజానికి దగ్గరగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం మంత్రి మహబూబ్ నగర్లోని శ్రీనివాస దియేటర్ లో రైతన్న సినిమాను వీక్షించారు.దుక్కి దున్నడం, విత్తనం వేయడం మొదలుకొని పంటలు పూర్తిగా చేతికి వచ్చే వరకు రైతులు పడే బాధలు , పండిన పంట మార్కెట్ చేరవేయడానికి, చేరవేసిన పంటకు మద్దతు ధర, ప్రకృతి వైపరీత్యాలు తదితర అంశాల గురించి ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపించారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చి ఇటీవల ఉప సంహరించిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుకు గొడ్డలి పెట్టుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు,రైతు భీమా,ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలిగేలా విద్యుత్ వినియోగానికి మోటార్లు బిగించుకోవాలనడం బాధాకరమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు, డిసిసిబి వైస్ చైర్మన్ కోరమని వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post