MBNR – సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం కానున్నవిద్యాసంస్థలు

కరోనా కారణంగా మూతపడిన పాఠశాల ను పరిశుభ్రం చేసి సెప్టెంబర్ 1 నుంచి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మీదట మహాబూబ్ నగర్ జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కె జి బి వి లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు పరిశుభ్రం చేసే కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది.
విద్యా సంస్థల పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం నాటికి జిల్లాలో 777 పాఠశాలలను ఆట స్థలాలతో సహా పరిశుభ్రం చేయడం జరిగింది. 715 పాఠశాలల్లో తరగతి గదులను శానిటైజేసన్ చేయడం జరిగింది. 686 పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయగా, మరో 667 పాఠశాలలో వాష్ ఏరియాలు, కుళాయిలు, వంట గదుల ను శుభ్రం చేశారు. 651 తాగునీటి వనరులను కూడా శుభ్రం చేయడం జరిగింది. 637 పాఠశాలల్లో పిచ్చిమొక్కలు తొలగించగా నీరు నిల్వ ఉన్న నీటి గుంతలు పూడ్చివేయడం జరిగింది.
పాఠశాలల పరిశుభ్రం కోసం జిల్లా కలెక్టర్ తో సహా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ,పాఠశాల, సంక్షేమ శాఖల అధికారులు, ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వీటితో పాటు, పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు మున్సిపల్ ప్రాంతాలలో చైర్మన్లు, కమిషనర్లు, శానిటేషన్ సిబ్బంది దగ్గరుండి పరిశుభ్ర కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల పరిశుబ్రంతో పాటు, మరుగుదొడ్లు శుభ్రం చేయటం, అవసరమైన చోట వాటికి చిన్న చిన్న మరమ్మతులు చేయడం వంటివి పూర్తి చేశారు. పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులందరూ పాఠశాలలకు వస్తున్నందున వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Post