MBNR – సేవలలో జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

సేవలలో జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సోమవారం అయన మహబూబ్ నగర్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ లో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ యంత్రాన్ని ప్రారంభించారు. అంతేకాక ఇండియన్ రెడ్ క్రాస్ కు అనుసంధానంగా వున్న జనరిక్ మందుల షాపు ను ప్రారంభించారు. దీంతోపాటు జిల్లాకు చెందిన ముగ్గురు పేద విద్యార్థినిలు గోపిక,హరిత,శిరీష ఎంబీబీఎస్ లో సీట్లు సాధించగా వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని, గతంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క ఆక్సీజన్ బెడ్ కూడా ఉండేది కాదని ఇప్పుడు 567 బెడ్లు ప్రత్యేకించి 67 ఐ సి యూ బెడ్లు ఉన్నాయని,రెడ్ క్రాస్ లో ప్లేట్ లెట్లు వేరు చేసి యంత్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.దీని వల్ల డెంగ్యూ వ్యాధి సోకిన వారికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. అలాగే రెడ్ క్రాస్ ద్వారా రక్తదాన శిబిరాలు,అనాదాశ్రమం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నమని ,ఇందులో భాగంగానే ఎం బి బి ఎస్ లో ర్యాంక్ సాధించి చదువుకోలేని గోపిక,హరిత,శిరిషలకు రెడ్ క్రాస్ తరఫున. జిల్లా కలెక్టర్ సహకారం తో వారి ఎం బి బి ఎస్ పూర్తయ్యే వరకు సహకారం అందిస్తామని తెలిపారు.
జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ రాష్ట్ర ఏక్జిక్యూటివ్ బెక్కెం జనార్దన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైనందుకు గజ మాలతో మంత్రి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు లయన్ నటరాజ్,కార్యదర్శి డాక్టర్ శామ్యూల్, ట్రెజరర్ జగపతిరావు, డాక్టర్ రమణయ్య లయన్ గాంధీ ,డాక్టర్ రజని తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post