MBNR – స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నిక్షల అధికారి మరియు ఎం ఎల్ సి ఎన్నిక్షల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు ఆదేశించారు .

స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నిక్షల అధికారి మరియు ఎం ఎల్ సి ఎన్నిక్షల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు ఆదేశించారు .
గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల అధికారులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎం ఎల్ సి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు గాను ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో చురుకైన ఎం పిఓ ల ను పిఓ లు గా, అదేవిధంగా ఏ పి ఓ లు గా డిప్యూటీ తహసీల్దార్ లను ,సహాయకులుగా సీనియర్ అసిస్టెంట్లను గుర్తించాలని సహాయ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పి ఓ,2 ఏ పి ఓ లు,4 సహాయకుల ను నియమించాలన్నారు. ఈ నెల 27 న పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లా లో పోలింగ్ కేంద్రాలు 4 ఉన్నందున 4 పీవోలు, 8 మంది డిప్యూటీ తాసిల్దారులు, 12మంది సీనియర్ సహాయకులుగా తీసుకోవాలని ఆయన సూచించారు. వీరితోపాటు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని సూక్స్మ పరిశీలకులుగా నియమిం చాలని ఆదేశించారు. అంతేకాక ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒకరు చొప్పున జోనల్ అధికారులను నియమించి వారి జాబితాను తనకు పంపాలని అన్నారు. రూట్ అధికారుల నియామకాలను కూడా జరిపి తనకు తెలియజేయాలని ఆదేశించారు.
ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఒక జోన్ గా విభజించడం జరిగిందని, 10 జోన్లకు 10 వాహనాలను రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఎఫ్. ఎస్. టి, ఎస్. ఎస్. టి, వి .ఎస్. టి బృందాల జాబితాను కూడా తనకు తక్షణమే పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశానికి మహబూబ్ నగర్ నుండి రెవిన్యూ అదనపు కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల ఈఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారి కె.సీతా రామారావు, గద్వాల అదనపు కలెక్టర్ యు.రఘురామ్ శర్మ, షాద్ నగర్ ఆర్ డి ఓ రాజేశ్వరి ,జిల్లా వ్యవసాయ అధికారి మరియు ఎమ్మెల్సీ ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సుచరిత ,జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి సత్య నారాయణ మూర్తి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి పురుషోత్తం రెడ్డి, ఆయా జిల్లాల నుండి అదనపు కలెక్టర్లు మరియు ,ఏఆర్ వో లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .

Share This Post