MBNR – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ .వెంకట్రావు అన్నారు.

@ స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికల కు నోడల్ అధికారుల నియామకం-జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ .వెంకట్రావు అన్నారు.
గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు గాను 17 మంది నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్, మార్కుడు కాపీ నోడల్ అధికారులుగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణలను నియమించడం జరిగిందని ,వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నోడల్ అధికారిగా జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి సత్యనారాయణ మూర్తి ని, జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్ ను, ఎన్నికల రిసెప్షన్ మరియు పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ నోడల్ టీమ్ అధికారి గా ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీ , మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ ప్రదీపి కుమార్ ఉంటారని వెల్లడించారు .ట్రాన్స్పోర్ట్ మేనేజ్ మెంట్ నోడల్ అధికారిగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు ఉంటారని, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత ,మెటీరి యల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జిల్లా వెటర్నరీ అధికారి మధుసూదన్ గౌడ్, బ్యాలెట్ బాక్స్ ల నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ,ఎం సి సి నోడల్ అధికారిగా డిప్యుటీ సీఈ ఓ మొగులప్ప ,అబ్జర్వర్ల నోడల్ అధికారి గా జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, మహబూబ్నగర్ అర్బన్ తాసిల్దార్ పార్థసారథి, లా అండ్ ఆర్డర్ మరియు డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ నోడల్ ఆఫీసర్ గా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు ,కంప్యూటరైజేషన్ నోడల్ అధికారి గా జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి సత్యనారాయణ, హెల్ప్ లైన్, ఫిర్యాదుల విభాగం అధికారి గా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ దశరథం,హెల్త్ నోడల్ అధికారిగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ,ఎక్స్పెండిచర్ నోడల్ అధికారిగా బి. శ్యామ్ సుందర్ ప్రసాద్,డిప్యూటీ రిజిస్ట్రార్ టైటస్ పాల్ , సీజ్ చేసిన నగదు,వస్తువులను విడుదల చేసే నోడల్ కమిటీలో ఇన్చార్జి జెడ్పీ సీఈవో మొగులప్పు, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ శ్యాంసుందర్ ప్రసాద్, డిప్యూటీ రిజిస్ట్రార్ టైటస్ పాల్, జిల్లా కోశాధికారి కోమల ఉంటారని ,మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ప్రతిరోజు నివేదికలు పంపించే నోడల్ అధికారిగా కలెక్టర్ కార్యాలయ ఏ ఓ ప్రేమ్ రాజ్,ఎం ఎం సి నోడల్ అధికారిగా సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు. వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని కలెక్టర్ వెల్లడించారు.
నోడల్ అధికారులు అందరూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రోజు వారీ నివేదికలను ఎప్పటికప్పుడు తనతో పాటు, రిటర్నింగ్ అధికారికి,సహాయ రిటర్నింగ్ అధికారులకు పంపించాలని ఆదేశించారు.
నోడల్ అధికారులు ఎన్నికల విధులు ఖచ్చితంగా నిర్వహించినప్పుడే ఎలాంటి ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మహబూబ్ నగర్ లోఎంపిడిఓ కార్యాలయంలో, అదేవిధంగా పూర్వపు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని డివిజన్ కేంద్రాలు ప్రస్తుత జిల్లా కేంద్రాలలోని ఎంపీడీవో కార్యాలయాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రిసెప్షన్ సెంటర్ ను,స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఎం ఎల్ సి ఎన్నికలలో భాగంగా ప్రతి జిల్లాకు సంబంధించి రెండు ఎఫ్ ఎస్ టి ,ఓక ఎస్ ఎస్ టి బృందాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వీడియో సర్వలేన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, అలాగే కౌంటింగ్ సెంటర్ లో కూడా పూర్తి కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని తెలిపారు. ఎన్నికల విధులకు నియమించే వారిని తప్పనిసరిగా రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న వారిని నియమించాలని ఆదేశించారు. అన్ని పోలింగ్ కేంద్రాలతోపాటు, కౌంటింగ్ కేంద్రం వద్ద కోవిడ్ -19 బృందాలను ఏర్పాటు చేయాలని, డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ శశికాంత్ ను ఆదేశించారు .
జిల్లా ఎస్ పి ఆర్ .వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Share This Post