MBNR – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. వెంకట రావు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఆయన తన చాంబర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు ఏర్పడబోతున్నాయని,వీటి ఎన్నికకు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసిందని తెలిపారు. అదేరోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమలులోకి వచ్చిందని వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కు ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని ,23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, డిసెంబర్ 10న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని ,డిసెంబర్ 14 న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.
స్థానికి సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఇదివరకే నోడల్ అధికారులను నియమించి సమావేశం కూడా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.ఈ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాను ఈ నెల 15వ తేదీన ప్రచురించడం జరుగుతుందని, ఓటర్ల జాబితాపై 15 నుండి 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 21, 22 తేదీలలో వాటిని పరిశీలించడం జరుగుతుందని ,తుది జాబితాను ఈనెల 23న ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో జరుగుతాయని, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓటర్లుగా ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇవన్నీ కూడా ఆయా రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లేదా గుర్తించిన ఇతర కార్యాలయం లేదా పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రిపంపిణీ, రిసెప్షన్,కౌంటింగ్ కేంద్రాలను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల లో నిర్వహించేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి డిసెంబర్ 16 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, షాద్ నగర్ డివిజన్, వికారాబాద్ పరిధిలోని 3 మండలా ల పరిధిలో ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏలాంటి బ్యానర్లు, పోస్టర్లు,ఫ్లెక్సీ లు ఉండరాదని ఆయన తెలిపారు.
బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఈ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు ,ఇతర ఎన్నిక్షల సామాగ్రినంతటినీ మహబూబ్ నగర్ జిల్లా నుండే పంపిణీ చేయటం ,పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ ఎన్నికలకు రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె.సీతారామ రావుఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గాను, సహాయ రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరిస్తారని తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే జడ్పిటిసి, ఎంపీటీసీలు ,కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు అందర్నీ కలుపుకొని ప్రాథమికంగా 1427 ఉన్నట్లు గుర్తించడం జరిగిందని,పూర్తి జాబితాను త్వరలోనే తయారు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు .
ఈ స్థానిక సంస్థల ఎం ఎల్ సి ఎన్నికలలో పోటీ చేసేందుకు సాధారణ ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉండి, 30 సంవత్సరాలు దాటిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పౌరులు అర్హులని,ఎన్నికల లో పోటీచేసే వ్యక్తి 5000 /- రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీలు అయితే 2500 చెల్లించాలని ఆయన తెలిపారు.
అన్నీ ఎన్నికల మాదారిగానే ఈ ఎన్నికలను కూడా సక్రమంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు జిల్లా ఎన్నికల అధికారికి పూర్తి సహకారం అందించాల్సిందిగా పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్లు, ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాల పైసందేహాలను నివృత్తి చేసుకున్నారు.
స్థానిక సంస్థల ఆడాన్సపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎమ్మెల్సీ ఎన్నికల ఈ ఆర్ ఓ &రెవెన్యూ అదనపు కలెక్టర్ కే .సీతారామారావు మాట్లాడారు.
ఈ సమావేశానికి కి
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బిజెపి, సిపిఐ ,బిఎస్పి, సిపిఎం, టిడిపి, వైఎస్ఆర్సిపి, ఎంఐఎం పార్టీల తరఫున ఆ పార్టీ ల అధ్యక్షులు హాజరయ్యారు.

Share This Post