MBNR – స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వనమహోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వనమహోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు .
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం అయన జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సమీపంలో రహదారికి పక్కన మొక్కలను నాటారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర రావు పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కేంద్రంతో పాటు, పట్టణ ప్రాంతాలు మొదలుకొని గ్రామాల వరకు మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలో 3 ఫ్రీడమ్ పార్కులు, మున్సిపల్ ప్రాంతాలలో 2 ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా, జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను పండగ వాతావరణం లో నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు .దేశానికి స్వతంత్రాన్ని సాధించేందుకు మహనీయులు ఎంతో కష్టపడి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని, వారి కలలను సాకారం చేసే విధంగా వారి త్యాగానికి గుర్తుగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. గడిచిన 75 సంవత్సరాల లో పేదరికం, అసమానతలతో దేశం ఎన్నో ఇబ్బందులు పడిందని ,అభివృద్ధి లేక ఎంతోమంది పేదవారుగా ఉన్నారని అన్నారు. యువతకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికి, జిడిపి పెరిగి ,నీరు, విద్యుత్, వ్యవసాయం వంటి రంగాలలో స్వయం సమృద్ధి సాధించి ఆయా సంస్థలలో యువత ముందుకు సాగినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని, దేశంలోనే అతి పెద్దదైన, 2097 ఎకరాలలో కెసిఆర్ ఎకో పార్కును ఏర్పాటు చేశామని ,అవే కాకుండా మెడికల్ కాలేజీలు, పాఠశాలలు, బైపాస్ రహదారులు, నక్లెస్ రోడ్ ,శిల్పారామం, ట్యాంక్ బండ్ వంటివి ఎన్నో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. వజ్రోత్సవాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డిసిసిబి ఉపాధ్యక్షులు కొరమాని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కొరమోని వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ , మున్సిపల్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Share This Post