MBNR – స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 14 న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ మైదానం నుండి బాదం రామస్వామి ఆడిటోరియం వరకు జానపద కళాకారులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం అక్కడ జానపద కళాకారులతో జానపద నృత్యాలు, కోలాటం, డప్పలు ,చెక్కభజన, బంజారా నృత్యం, మహిళా కోలాటం, తదితర జానపద కళలను కళాకారులు ప్రదర్శిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారని, అంతేగాక ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున తిలకించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Share This Post