MBNR – హెల్త్ పారామీటర్స్ లో దేశంలో తెలంగాణ ముందుందని ఇంకా మరిన్ని సేవలు అందిస్తే మరింత ముందుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు.

హెల్త్ పారామీటర్స్ లో దేశంలో తెలంగాణ ముందుందని ఇంకా మరిన్ని సేవలు అందిస్తే మరింత ముందుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు.
సోమవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా టి-డయగ్నిస్టిక్ ద్వారా అద్భుత సేవలు అందిస్తున్నామని, ఈ సేవలను విస్తృతం చేయాలన్నారు. ఆసుపత్రులలో తాగునీరు,శానిటేషన్ వంటి చిన్న చిన్న సమస్యలపై దృష్టిసారించాలన్నారు. 108,102 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ విషయమై కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలన్నారు. అమ్మ వడి,ఆలన వాహనాల సద్వినియోగం పై మాట్లాడుతూ అవసరమైతే రోగుల ఇంటి దగ్గరికి వెళ్లి చికిత్స అందించాలన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్ బి ఎస్ కె సేవలను తిరిగి ప్రారంభించి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులల్లో సాధారణ కాన్పులు చేయాలని,సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని, జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా ఈ విషయంపై ప్రభుత్వ ,ప్రైవేటు ఆస్పత్రుల గైనకాలజిస్టులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. కరోనా వాక్సిన్ నూటికి నూరు శాతం ఇవ్వాలని, రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను తగ్గించడం పై దృష్టి సారించాలని, కెసిఆర్ కిట్, కాయకల్ప, ఆయూష్ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా టీ-డ యగ్నిస్టిక్ కు శాంపిళ్ళు సేకరణ ఉండాలని, 108,102 వాహనాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ,అమ్మవడి, ఆర్ బి ఎస్ కె ,సాధారణ కాన్పుల విషయమై చర్చించేందుకు గాను డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్ర స్థాయి నుండి ఈ వి సి కి హాజరు కాగా , జిల్లా నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ,ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తదితరులు హాజరయ్యారు.

Share This Post