Medchal-Malkajgiri: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత వాతావరణం లో గణేష్ చతుర్థి పండుగజరుపుకోవాలి; జిల్లా కలెక్టర్ ఎస్ .హరీష్

పత్రికా ప్రకటన-1 04-09-2021

శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరములో లో గణేష్ ఉత్సవ సమితి అధికారులతో గణేష్ చతుర్థి పండుగ, గణేశ్ నిమజ్జనం ముందస్తు ఏర్పాట్లు పై, అదనపు కలెక్టర్లు నరసింహారెడ్డి శ్యాంసన్ డి సి పి ,రక్షిత కృష్ణమూర్తి, గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు, జిల్లా అధికారులు ,పోలీస్,విద్యుత్,మున్సిపల్ కమిషనర్ లు అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు చేసే భక్తులు,నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో సురక్షిత వాతావరణం లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపు కోవాలని కోరారు.గత 16 నెలలుగా కోవిడ్ కారణంగా కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు,గణేష్ చతుర్థి పండుగ,నిమజ్జనం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి జరుపుకోవాలని అన్నారు.ప్రతి మండపం వద్ద కోవిడ్ నిబంధనలు సూచిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేయాలని,భౌతిక దూరం పాటించాలని,ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించు కోవాలని అన్నారు.మండపాల నిర్వాహకులు శానిటైజర్,మాస్క్ లు ధరించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గణేష్ ఉత్సవ సమితి కొని సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోని రాగ కలెక్టర్ సానుకూలంగా సంపాదించినారు అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చినారు .
గణేష్ ఉత్సవ సమితి కోరిన విధంగా గణేష్ శోభా యాత్ర నిర్వహించే రూట్ లో గుంతలు పడిన రహదారులు ప్యాచ్ వర్క్ రిపేర్ లు మున్సిపల్,ఆర్&బి శాఖ అధికారులు చేపట్టాలని ఆదేశించారు.గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల వద్ద క్రేన్ లు,బ్యారికెడింగ్ ,వేదికఏర్పాటుకు ఆర్&బి,మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.,నిమజ్జనం రోజు సెప్టెంబర్ 19 న గజ ఈత గాళ్లను మత్స్య శాఖ ఏర్పాటు చేయాలని,లైటింగ్ మున్సిపల్,విద్యుత్ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు.మండపాల నిర్వాహకులు వినాయక విగ్రహ మండపాల వద్ద పరిశుభ్ర,ఆరోగ్య కర వాతావరణం ఉండేలా చూడాలని,చెత్త వేయుటకు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.మున్సిపల్ శాఖ ప్రతి రోజు పారిశుధ్యం,చెత్త సేకరణ వాహనం ఏర్పాటు చేసి చెత్త తొలగించాలని ఆదేశించారు. డి ఎం చ్ ఓ మాలికార్జునరావు ని అంబులెన్సు లను సిద్ధం చేయాలని ,ఏర్పాటు చేయాలని సూచించినారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని తెలిపినారు అధికారులు అందరూ ముందస్తు గా ప్రణాళికలు రూపొందించుకోవాలి అని సూచించినారు
వినాయక నిమజ్జనం సమయంలో తగిన జాగ్రతలు పాటించాలన్నారు.అధికారులు కూడా ఎప్పటికప్పుడు వినాయక నిమజ్జనాలను పరిశీలించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెరువు, కుంటల వద్ద విలైనన్ని క్రేన్‌లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు త్వరగా జరిగేలా చూడాలన్నారు. కొవిడ్‌ నింబంధనలు పాటిస్తు ఉత్సవాలను జరుపుకోవాలని కమిటి సభ్యులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో , డిఆర్వో లింగ్యా నాయక్, ఆర్డీవో రవి,మల్లయ్య ,పోలీస్ అధికారులు ,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post