పత్రికాప్రకటన -1 తేది.30.08.2021
వాతావరణ శాఖ జారీ చేసిన సూచనలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. పూర్వ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల , విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు , ఉద్యోగులు హెడ్ క్వాటర్స్ లోనే ఉండాలని స్పష్టం చేశారు.
జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తు, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్ . హరీష్ , జిల్లాలో వర్షాల కారణంగా చేపట్టిన ముందస్తు చర్యలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు మేరకు అధికారులను అప్రమతము చేసినాము అని తెలిపినారు .సిద్దిపేట జిల్లా పరిధి లో భారీ వర్షము కారణమూ గా మల్లారం దగ్గర పంపులు ఆపి వేయటం జరిగింది అని మల్లరం w t p ఆవరణ అనుసంధాన ప్రాంతం నుండి వర్షపు నీరు వల్ల ప్రహరీ గోడ గండి పడి వర్షము నీరు మల్లారం పంప్ హౌస్ లోనికి నీరు వచ్చిందని తెలిపినారు . ముందస్తు జాగ్రత్త గా అన్ని పంపులు ను కొద్దీ గంటలు ఆపేసి వర్షపు నీటిని బయటకు పంపే పని జరుగుతుంది అని తెలిపినారు .ఈ సమస్య వల్లనా మేడ్చల్ కి నీరు ఆపటం జరిగింది అని, సర్పంచులను మునిసిపల్ కమీషనర్ లకు ,మునిసిపల్ చైర్మన్ లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలిసింది గా అధికారులకు ఆదేశాలు జారీ చేసాము అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి తెలిపినారు .
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భవత్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంఘటనలు లేవని, తెలిపారు. ప్రమాద ప్రాంతాలు ఉన్న చోట ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ జాన్ శాoసన్, మల్కాజ్గిరి డిసిపి రక్షిత మూర్తి, డి ఎం&హెచ్ ఓ మల్లికార్జున రావు, సిపిఓ మోహన్ రావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు