Medchal-Malkajgiri : జిల్లాలో అడవుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన–2 తేదీ : 21–08–2021
=============================================

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని దీనికిగాను పటిష్టమైన చర్యలు చేపట్టాలని , జిల్లా ఇంఛార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరరంలో జిల్లా అటవీ శాఖ అధికారి , జిల్లాలోని రేంజ్ అధికారులు, జిల్లా అధికారులు,సెక్షన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 33 శాతం అడవులు ఉండాలని సూచించారు. అలాగే అటవీ శాఖ అధికారులు , అన్ని శాఖల అధికారులతో సమ్వయం చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అడవుల సంరక్షణకు అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. అలాగే సర్వే అధికారులు అటవీ భూములను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశానికి ముందు జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో అటవీ విస్తీర్ణం, చేపట్టిన పనులను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ (అర్బన్) జాన్ శాంసన్,ఆర్డీఓ లింగ్యా నాయక్, ఆర్డివోలు రవి, మల్లయ్య, డిఎఫ్ఓ వేంకటేశ్వర్లు, సిపిఓ మోహన్ రావు,డీఈఓ,డిఆర్డిఓ, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post