Medchal-Malkajgiri: జిల్లా లోని అని పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎస్ . హరీష్

పత్రిక ప్రకటన–1 తేదీ : 27–08–2021
==================================================================================

శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో పరిశ్రమలు శాఖ వారి అధ్యరంలో టి.స్.ఐ.పాస్ మీద అడిషనల్ కలెక్టర్(రెవిన్యూ ) నర్సింహారెడ్డి తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ఎస్ . హరీష్ నిర్వహించినారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని అని పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. దానికి కావలిసిన అన్ని సదుపాయాలు వసతులు కలిపించవలెను అని జిల్లా పెట్టుబడి ప్రమోషన్ కమిటీకి కి సూచించినారు టి.స్.ఐ.పాస్ ద్వారా అరుహులైన లబ్దిదారులకు చేయూత నివ్వాలి అని కలెక్టర్ తెలిపినారు . అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్దికి అవసమైర తోడ్పాటునందించేందుకు ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు చేయూతనిస్తూ వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా లో పరిశ్రమలు కు ప్రోత్సాహకం లో భాగముగా పావలా వడ్డీ కింద (6 .40 ) ఆరు లక్షల నలబై వేలు రూపాయిలు ఎస్ .సి వారికీ 11 యూనిట్లు, కి (11 .50 ) పదకొండు లక్షల యాబయి వేల రూపాయిలు మరియు ఎస్.టీ వారికీ 05 యూనిట్లు,( 26 .౩౦) ఇరవై ఆరు లక్షలు ముపై వేలు పెట్టుబడి రాయితీ 5 పరిశ్రమలకు బొగ్గు కేటాయింపులకు అనుమతి ఇచ్చినారు.ఈ మీటింగ్ లో మంజూరు చేయటము జరిగినది అని జిల్లా కలెక్టర్ తెలిపినారు.
పెండింగ్ లో వున్నా అప్లికేషన్స్ అని నిర్ణిత సమయములో క్లీరెన్సు ఇవ్వవలెను అని అధికారులకు సూచించినారు . సంబందించిన శాఖలు అని సమన్వయం తో కలిసి పని చేయాలని సూచించినారు .
. ఈ సమావేశంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రవీందర్, డిప్యూటీ చీఫ్ ఫ్యాక్టరీస్ ,శ్రీనివాసరెడ్డి ,లీడ్ బ్యాంకు మేనేజర్ పి.కిశోర్ కుమార్ ,జాయింట్ డైరెక్టర్ ,తుల్జా నాయక్ సంబంధిత శాఖల అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post