Medchal-Malkajgiri: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి లెక్చరర్స్ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అన్నారు

పత్రికా ప్రకటన 08-09-2021
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి లెక్చరర్స్ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధిపై కళాశాల ప్రిన్సిపాల్ తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఉత్తీర్ణత శాతం అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాలలో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు కెమిస్ట్రీ ల్యాబ్ లైబ్రరీలు వంటి వస్తువుల గురించి తెలుసుకున్నారు. కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బిల్డింగ్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నందుకు గల కారణాలను వెంటనే తెలియ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిగ్రీ కళాశాల లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి , మల్కాజ్గిరి కుకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post