Medchal-Malkajgiri: మలేరియా, డెంగీ నివారణకు పటిష్ట చర్యలు, డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్

పత్రిక ప్రకటన–2 తేదీ : 25–08–2021
=============================================
మలేరియా, డెంగీ నివారణకు పటిష్ట చర్యలు,
డ్రై డే తో పాటు పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరములో జిల్లా కలెక్టర్ ఎస్ .హరీష్ , అదనపు కలెక్టర్లు ,నరసింహ రెడ్డి ,జాన్ శాంసన్ డి ఎం చ్ ఓ ,మాలికార్జునరావు తో కలిసి సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల పై ,వైద్యాధికారులు, మునిసిపల్ అధికారులు ,సంబంధిత శాఖ అధికారుల తో ,ఎంపీడీవోలు తో, సమీక్ష సమావేశం నిర్వహించారు.
సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సమయంలో దోమలు, ఈగలు, వైరస్‌ బ్యాక్టీరియా వ్యాప్తిచెంది సీజనల్‌ వ్యాధులు ప్రబలే బెడద ఎక్కువ. ప్రజలపై ప్రతాపం చూపుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ, డయేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను నిరోధించవచ్చు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అని జిల్లా కలెక్టర్ తెలిపినారు ,జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు పారిశుద్ధ కార్మికులు, వైద్య మరియు అంగన్వాడి వర్కర్లు ఏఎన్‌ఎంలు, ఆశ ,ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి మరియు వారి ఇంటి పరిసరాలను పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తూ ఉండాలని, అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీటి తోట్టిలలో, టైర్ లలో మురికి నీరు ఉండకుండా చూసుకోవాల్సిన బాద్యత ఇంటి వారు తీసుకోవాలని వారికీ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఫీవర్‌ సర్వే చేస్తూ జ్వరపీడితులనుగుర్తించాలి అని తెలిపినారు, జ్వర సర్వే ప్రక్రియ ని కొనసాగించాలి ఈ విషయములో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని స్పష్టం చేసినారు .
మునిసిపల్ అధికారులు ఒక ప్రణళికలు రూపొందించుకోవాలి అని తెలిపినారు మున్సిపల్ కమిషనర్లు కౌన్సిలర్ లతో సమావేశం,.ఇంటింటికి తిరిగి ప్రతిరోజు సమావేశాలు నిర్వహించాలి .గ్రామాలలో వాన నీటి గుంతలు ఉండరాదు, ఎక్కడైనా మురికి నీటి, మంచి నీటికి , గుంటలు ఉంటే గంబుషియా చేపలు వదలాలి , అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి అని ,ప్రతి మండలంలో కనీసం 10 వేల ఆయిల్ బాల్స్ వేయాలి ,ప్రతి రోజు గ్రామాలలో ఫాగింగ్ చేయాలి, , అని డిపిఓ రమణ మూర్తి ని అద్యేసించినారు
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు, నరసింహరెడ్డి, జాన్ శాoసన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జున రావు, డిపిఓ రమణ మూర్తి,డిఇఓ ప్రసాద్, పిఈ డిటీఎస్, డి డబ్ల్యు ఓ,బీసీ వెల్ పెయిర్ అధికారి ఝాన్సీ,పిడి డిఆర్ డిఏ, ఆర్ డబ్ల్యుఎస్,ఐకెపి, మున్సిపల్ కమిషనర్లు,ఎంపిడిఓలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post