Medchal-Malkajgiri: ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో పనులు వేగవంతం చేయాలి జిల్లా అధికారులతో కలెక్టర్. ఎస్ హరీష్ సమీక్ష

పత్రిక ప్రకటన–1 తేదీ : 25–08–2021
============================================

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దత్తత గ్రామమైన మూడు చింతలపల్లి ,లక్ష్మాపూర్లో, కేశవాపురం, పనులను వేగవంతంగా చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపినారు. బుధవారం కలెక్టరేట్ లోని తన చాంబర్స్ లో అడిషనల్ కలెక్టర్(రెవిన్యూ ) నర్సింహారెడ్డి తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జిల్లాలోని దత్తత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో తీసుకెళ్ళాలి అని అధికారులకు స్పష్టం చేసినారు . ఈ విషయంలో గ్రామంలో అన్ని రకాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాభివృద్దికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, చేపట్టాల్సిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేనట్లయితే కఠిన చర్యలు తప్పవు అని కలెక్టర్ హెచ్చరించారు. పనులు ఎంత వరకు వచ్చినవి అని అడిగి తెలుసుకొన్నారు , పెండింగ్ లో వున్నా పనులు తర్వాతి గతిన పూర్తి చేయుటకు అధికారులు పూర్తి గా ప్రణాళికలు రూపొందించుకోవాలి అని తెలిపినారు స్వయంగా ముఖ్యమంత్రి గ్రామాభివృద్దికి హామీనిచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ? వాటిని ఎలా పరిష్కరించాలి ? ఆదర్శవంతమైన గ్రామాలను ఎలా తీర్చదిద్దాలనే విషయాలను ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారి అవసరాలను తీర్చేలా చూడాలని కలెక్టర్ వివరించినారు. అధికారులు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడంతో పాటు వాటిని తన దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించినారు. అలాగే ముఖ్యమంత్రి దత్తత తీసుకొన్న గ్రామాల్లో అభివృద్ది విషయంలో ఏమాత్రం వెనుకాడవద్దని ప్రభుత్వం నుంచి ఏమాత్రం నిధుల కొరతలేదని అవసరమైన పనులు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. దీంతో పాటు ఈ గ్రామాల అభివృద్దికి ఇంకా ఏమైనా ప్రత్యేక నిధులు అవసరమున్నా ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలిపినారు. ఈ సమావేశంలో , సిపిఓ మోహన్ రావు, ఆర్&బి ,ఈఈ, పంచాయతీరాజ్ ఈఈ,, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post