Medchal-Malkajgiri: మేడ్చల్ జిల్లా పరిధిలోని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన 08-09-2021

బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో, ఉత్సవ సమితి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా పరిధిలోని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటుతోపాటు, బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత ఆదేశించారు. చెరువుల్లో నీటిశాతాన్ని పరిశీలించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. శాంతి భద్రత విషయంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళలో కరెంటు అంతరాయం కలగకుండా చూసుకోవాలని. వ్రేలాడే కరెంటు తీగలు సరిచేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. చెరువుల వారీగా ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని పోలీస్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి, జాన్ శ్యాంసన్, డిఆర్ఓ లింగా నాయక్ ఆర్డిఓ రవి, మల్లయ్య ,మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్ లు, పోలీస్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post