Medchal-Malkajgiri:- విద్యార్థులకు మంచి భవిష్యత్తు నందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు

పత్రికా ప్రకటన-1 08-09-2021
విద్యార్థులకు మంచి భవిష్యత్తు నందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి అన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని జి పి ఆర్ ఆర్ గార్డెన్స్లో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందుతున్న ప్రతి ఉపాధ్యాయునికి శుభాకాంక్షలు తెలియజేశారు. మేడ్చల్ జిల్లాలో పేద మధ్య తరగతి చెందిన పిల్లలు ఎంతో మంది కష్టపడి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. అటువంటి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి భవిష్యత్తు అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కూడా తయారు చేయాలని వారు జీవితంలో ధైర్యసాహసాలతో ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొనే విధంగా తయారు చేయాలని అన్నారు. జాతి నిర్మాణం తరగతి గదిలోనే నిర్మించబడుతుంది అని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యేకు కేటాయించిన 5 కోట్ల లో 2 కోట్లు పాఠశాల పై విద్య పై ఖర్చు చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని పొందుతున్నారు కాబట్టి ప్రతి గురువు తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. అవార్డు తీసుకునే ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మేడ్చల్ బడి ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పారని ఉపాధ్యాయులను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, జడ్పీ వైయస్ చైర్పర్సన్ బెస్త వెంకటేష్ ,జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షులు నంద రెడ్డి, కీసర ఎంపిడిఓ పద్మావతి, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share This Post