PressRelease Dt:04.06.2021.
కథా శిఖరం కాళీపట్నం రామారావు మాస్టారుకు కన్నీటి నివాళి
కాళీపట్నం రామారావు మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర సంతాపం ప్రకటించారు.
కాళీపట్నం రామారావు మాస్టారు సరళ భాషా రచయిత, కథకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనందున రచనా శైలి సరళంగా ఉండి సామాన్య జ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావ ప్రాధాన్యరచనలు చేశాడని, మాస్టారుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కారా మాస్టారుగా ప్రసిద్ది పొందిన కాళీపట్నం రామారావు. మాస్టారు తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేష కృషి చేశారని తెలిపారు. రామారావు మాస్టారు కుటుంబ సభ్యులకు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.