MGNREGS పనులపై సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.        తేది.:29.11.2021, వనపర్తి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఎం.పి.డి.ఓ.లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు జాబ్ కార్డులు వెరిఫికేషన్ చేయాలని అన్నారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణకు హరితహారం, కూలీలకు వేతన చెల్లింపులు, కూలీల సంఖ్య పెంపుదలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. కూలీలకు సంబంధించిన నివేదికలు, లేబర్ బడ్జెట్ వివరాలను వెంటనే నమోదు చేయాలని, పనులలో జాప్యం లేకుండా, సామర్థ్యం పెంచేందుకు అనుగుణంగా కూలీలను పెంచి అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కూలీలకు ఎలాంటి జాప్యం లేకుండా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డిఆర్డిఓ నరసింహులు, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ఎం.పి.డి. ఓ.లు, ఏ.పీ.ఓ.లు, డి ఆర్ డి ఓ. సిబ్బంది, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post