MGNREGS బృహత్ పల్లె ప్రకృతి వనాల పురోగతిపై సమీక్షా సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:18.11.2021, వనపర్తి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం జి ఎన్ ఆర్ జి ఎస్ క్రింద చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పనులపై ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని ఆమె సూచించారు. మొదటి విడతగా జిల్లాలో మొత్తం (14) పల్లె ప్రకృతి వనాలు మంజూరు కాగా, ప్రతి మండలానికి ఒకటి చొప్పున (12) పూర్తి అయినట్లు, (2) ప్రగతిలో ఉన్నట్లు ఆమె వివరించారు. రెండవ విడతగా (56) పల్లె ప్రకృతి వనాలకు మంజూరు కాగా, ప్రతి మండలానికి (4) చొప్పున మొత్తం (56) ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఉపాధి హామీ కార్మికుల సంఖ్య ప్రతి గ్రామానికి (40) చొప్పున ఏర్పాటు చేయాలని, నర్సరీలలో డాల్ఫిన్ చేసి, విత్తనాలు చల్లి, రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని, ముళ్ల పొదలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని ఆమె తెలిపారు. వాటికి సంబంధించిన బడ్జెట్ రిపోర్టులను సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్, జెడ్ పి సీఈఓ వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఓ నరసింహులు. అదనపు డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ఏపీ డి సుల్తానా, డిప్యూటీ సీఈఓ రామ్ మహేశ్వర్ రెడ్డి, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎం పి ఓ లు, ఏ పీ ఓ లు, ఈ.సి. లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post