MGNREGS హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్ పనులపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్

పత్రికా ప్రకటన.        తేది.:20.11.2021, వనపర్తి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని, అనుకున్న లక్ష్యాన్ని చేరాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం రాజస్వ మండలాధికారి కార్యాలయం సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎం.పి. ఓ.లు, ఏ పీ ఓ లు, ఈసీలు, టి.ఎ.లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేపట్టిన హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్ పనులపై సమీక్షించి, తగు సూచనలు అందచేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలు, లేబర్ బడ్జెట్ వివరాలను వెంటనే తయారు చేయాలని ఆయన తెలిపారు. ఒకరోజు శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకొని పనులలో పురోగతి సాధించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నరసింహులు, సీఈవో వెంకట్ రెడ్డి, ఈ సి ఓ. రామ్ మహేశ్వర్ రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ఇంచార్జ్ డి పి ఓ. యాడ్ అయ, ఏపీ డి సయ్యద్ సుల్తాన్, మాస్టర్ ట్రైనర్స్, ఎంపీడీవో శ్రీపాద, ఏపీవో కురుమయ్య, ఈ సి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post