పత్రికా ప్రకటన తేది:24.09.2021.
వనపర్తి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ MGNREGS, తెలంగాణకు హరితహారం, జల శక్తి అభియాన్, ఆజాద్ కా అమృతోత్సవ్ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మాట్లాడారు.
MGNREGS పనులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. తెలంగాణకు హరితహారం మొక్కలను పెండింగ్ లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని సత్వరమే పరిష్కరించి పూర్తి చేయాలని ఆమె అన్నారు. ప్రతి గ్రామాలలో జల శక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాలని, నీటి పొదుపు, ఉపయోగాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. ఆజాద్ క అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు అభివృద్ధి పనులు చేపట్టి, కొనసాగిస్తున్నట్లు ఆమె వివరించారు. అన్ని ప్రాంతాలలోని అధికారులు వారికి కేటాయించిన APP అప్డేషన్ చేయాలని ఆమె సూచించారు ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వాటి సంరక్షణ బాధ్యత అధికారులు పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) అంకిత్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డి పి ఓ సురేష్, డీఎల్పీవో, డి ఆర్ డి ఓ నరసింహులు, అడిషనల్ డి ఆర్ డి ఓ కృష్ణయ్య, ఏ పీ డీ లు, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏ పీ ఓ లు, ఏసీ ఎల్ బి సీఈఓ, ఏపీ డి సుల్తాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.