MLC అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తున్నరిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్.

 

ఎమ్మెల్సీ ఎన్నికలకు 6 నామినేషన్లు దాఖలు

రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

0000

7- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజ వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యులు ఎన్నిక కోసం శనివారం రోజున 6 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం రోజున మాసర్తి రమేష్ స్వతంత్ర్య అభ్యర్థిగా, నలుమాచు రామకృష్ణ స్వతంత్ర్య అభ్యర్థిగా, పురం రాజేషం స్వతంత్ర్య అభ్యర్థిగా ఒక్కొక్క నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ఇంతకుముందు నామినేషన్ దాఖలు చేసిన వారిలో తిరిగి ఈరోజు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి టి.ఆర్.ఎస్. పార్టీ తరపున ఒక నామినేషన్, స్వతంత్ర్య అభ్యర్థిగా ఒక నామినేషన్ మొత్తం రెండు సెట్లు, బొమ్మరవేణి తిరుపతి స్వతంత్ర్య అభ్యర్థిగా తిరిగి ఈరోజు మరో ఒక నామినేషన్ సెట్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. మొత్తం శనివారం వరకు కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం శాసన మండలి ఎన్నికలకు 6 గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

Share This Post