MNCL : అభివృద్ధికి ఆదర్శంగా చెన్నూర్‌ నియోజకవర్గం : రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి శాసనమండలి సభ్యులు దేశ్‌పతి శ్రీనివాస్‌, బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చెన్నూర్‌ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ విషయంలో ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌ అలుపెరుగని కృషి ఎంతో ఉందని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చూపిన ఉద్యమ స్ఫూర్తి చెన్నూర్‌ నియోజకవర్గ అభివృద్ధిలో సైతం చూపడం అభినందనీయమని, చెన్నూర్‌ దశ దిశ మారుస్తూ అభివృద్ధికి పాటు పడుతున్న నాయకుడని, నియోజకవర్గాన్ని తన సొంతింటిలా భావించి అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. 37 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన లో లెవల్‌ బ్రిడ్జి 37 కోట్ల రూపాయలతో ఆర్‌.ఓ.బి., 21 కోట్ల 70 లక్షల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, 3 కోట్ల రూపాయలతో స్టేడియం, 4 కోట్ల రూపాయలతో బస్‌ డిపో, 18 కోట్ల రూపాయలతో జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుండి అంబేద్కర్‌ చౌక్‌ వరకు బటర్‌పై లైట్లు, మహిళలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, 14 కోట్ల రూపాయలతో 77 సమ్మక్క సారక్క భవనాలు, విద్యార్థినీ, విద్యార్థుల కోసం గ్రామగ్రామాన 100 గ్రంథాలయాల ఏర్పాటు, 2 కోట్ల 50 లక్షల రూపాయలతో కె.సి.ఆర్‌ పార్కు ఏర్పాటు చేస్తూ చెన్నూర్‌ నియోజకవర్గంలో సుమారు 205 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఒకే లభించే విధంగా సమీకృత కూరగాయలు, మాంసపు మార్కెట్‌ ఏర్పాటు చేసి విక్రయదారులకు కూడా ఉపయోగకరంగా పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. చెన్నూర్‌ నియోజకవర్గానికి 50 పడకల మాతా, శిశు కేంద్రం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో 1 వేయి 600 కోట్ల రూపాయల వ్యయంతో 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఎత్తిపోతల పథకం మంజూరు జరిగి టెండరు ప్రక్రియ పూర్తి చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళల సంక్షేమాభివృద్ధి కోనం కళ్యాణలక్ష్మీ, ఆరోగ్యలక్ష్మీ పథకాల ద్వారా చేయూతనందించడంతో పాటు భూమి కలిగిన పేద వారు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మీ పథకం ద్వారా మహిళల పేరిట 3 లక్షల రూపాయలు అర్హులైన లబ్బిదారుల ఖాతాలలో జమ చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదించడం జరిగిందని తెలిపారు. మహిళలు త్రాగునీటి కొరకు ఇబ్బందులు పడకుండా మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటి నల్లా కనెక్షన్‌ అందించడం జరిగిందని తెలిపారు. గర్భిణీ మహిళల సంక్షేమం దృష్టా ప్రసవమైన తరువాత కె.సి.ఆర్‌. కిట్‌ అందించడం జరుగుతుందని, రక్తహీనత సమస్య పరిష్కరించేందుకు శ్రీరామనవమి పండుగ నాడు న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, 3-4 నెలల మధ్య, 7వ నెలలో ఒకసారి పౌష్టికాహారంతో కూడిన న్యూట్రిషన్‌ కిట్‌ మహిళలకు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలు అమలు చేయడం జరుగుతుందని, రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించి పండిన ప్రతి గింజను కొనుగోలు
చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో చేపట్టి అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ఇతర రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పథకాలను ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని, మూగజీవాల సంరక్షణ కొరకు 1962 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో యాసంగిలో 16 వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయడం ద్వారా 56 లక్షల ఎకరాలలో వరిసాగు చేయడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆదర్శంగా అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఫలాలు అందే విధంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. తునికాకు కార్మికుల సంక్షేమం కోసం జిల్లాలోని చెన్నూర్‌కు 18 కోట్ల 10 లక్షల 328 రూపాయలు, బెల్లంపల్లికి 10 కోట్ల రూపాయలు, మంచిర్యాలకు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కానున్నాయని, తునికాకు కట్టకు 2 రూపాయలు 50 పైసల నుండి 3 రూపాయలకు పెంచడం జరిగిందని, మహిళా అభివృద్ధి దిశ ప్రభుత్వం కృషి చేస్తుందని, అడవిని కాపాడుకుంటే మానవాళి, జీవరాశిని కాపాడుకోవచ్చని తెలిపారు.

ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు మాట్లాడుతూ గడిచిన 60 ఏండ్లలో ఏనాడు జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని, చెన్నూర్‌ నియోజకవర్గ అభివృద్ధి యజ్ఞం కొనసాగుతుందని అన్నారు. నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ కోసమే 160 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్‌ పట్టణంలో అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి అదనంగా 25 కోట్ల రూపాయలు మంజూరుకు ప్రతిపాదించడం జరిగిందని, రామకృష్ణాపూర్‌, చెన్నూర్‌, భీమారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, పార్‌పల్లి, ఆస్నాద్‌లను నూతన మండలాలుగా, చెన్నూర్‌ను రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వృద్ధి రేటులో శరవేగంగా ముందుకు వెళుతుందని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. చెన్నూర్‌ పట్టణంలో 21 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో 100 పడకల ప్రభుత్వ దవాఖాన, 4 కోట్ల రూపాయలతో చెన్నూర్‌ బస్‌ డిపో నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని, 2 కోట్ల 65 లక్షల రూపాయల నిధులతో 6.34 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభించడంతో పాటు 1 కోటి 70 లక్షల రూపాయలతో స్టేడియంలోని
పలు పనులకు శంకుస్థాపన, 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి వేసిన కుమ్మరి కుంట చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌, చెన్నూర్‌ పట్టణంలో 1 కోటి 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డంపింగ్‌ యార్డ్‌ ప్రారంభోత్సవంతో పాటు ఎఫ్‌.ఎస్‌.టి.పి. శంకుస్థాపన, 18 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన నాలుగు వరుసల ప్రధాన రహదారి, సెంట్రల్‌ లైటింగ్‌, 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో 2 ఎకరాలలో నూతనంగా నిర్మించిన కె.సి.ఆర్‌. పార్క్‌ప్రారంభం, పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ తల్లి, మహాకవి శిరోమణి శ్రీ వానమామలై వరదాచార్యులు, మహాత్మా జ్యో, లే విగ్రహల విగ్రహ ప్రతిష్టాపన, 1 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సమ్మక్క – సారలమ్మ మహిళా భవనాలకు శంఖుస్థాపన, 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన పెద్ద చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ ప్రారంభం, 7 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సి.హెచ్‌.సి. కేంద్రంలో అదనంగా 2 కోట్ల 97 లక్షల రూపాయలతో పలు పనులకు శంకుస్థాపన, చెన్నూరు నియోజకవర్గంలోని 100 గ్రామపంచాయతీలలో 4 కోట్ల రూపాయలతో 100 లైబ్రరీల ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం 17 వేల 899 మంది లబ్దిదారులకు 4 కోట్ల 79 లక్షల రూపాయల అభయహస్తం నిధులు, 24 వేల
440 మంది లబ్దిదారులకు 3 కోట్ల 36 లక్షల రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ, 2016 నుండి 2021 వరకు 38 వేల 556 మంది బీడీ కార్మికులకు 18 కోట్ల 11 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం చెన్నూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

    

Share This Post