జిల్లాలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పనుల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, టైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి జిల్లాలోని లక్షైట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమం, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, చందారం గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరం, మన ఊరు – మన బడి పాఠశాల పనులు, వైకుంఠధామం (శ్మశానవాటిక), కంపోస్ట్ షెడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని, ఈ (క్రమంలో పాఠశాలల్లో వంటశాల, భోజనశాల, తాగునీరు, అదనపు గదులు, మూత్రశాలలు, విద్యుత్, బెంచీలు ఇతరత్రా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనాన్ని ప్రోత్సహించే విధంగా పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలను నాటి సంరక్షించడం జరుగుతుందని, పల్లెప్రకృతి వనాలలో నాటిన మొక్కల పెరుగుదలను పర్యవేక్షిస్తూ అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చేపట్టిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ఎంపిక చేసిన క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రతి నిత్యం ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెత్తలో ఉపయోగపడే వాటిని కంపోస్టు షెద్దుకు తరలించి సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఇందు కొరకు జిల్లాలో 40 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి రోజు 9 గం॥ల నుండి సాయంత్రం 4 గం॥ల వరకు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కంటి వెలుగు శిబిరాలను 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా విసృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్, మండల తహళశిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాధికారి, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.