ప్రతి జిల్లాలో అమృత్ సరోవర్ పథకం ద్వారా పాత కుంటలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టాలని జాతీయ నీటి వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అన్నారు. బుధవారం అమృత్ సరోవర్ పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ నీటి వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్ పనులను గుర్తించాలని, మంచిర్యాల జిల్లాలో 63 కుంటలను గుర్తించడం జరిగిందని, క్రొత్తవి, పాత కుంటల పున:రుద్దరణ చేపట్టాలని తెలిపారు. ప్రతి కుంట 1 ఎకరం విస్తీర్జానికి తగ్గకుండా 10 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉందే విధంగా చూడాలని తెలిపారు. అమృత్ సరోవర్ కార్యక్రమం ఈ నెల 24న ప్రారంభించి ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు కార్యచరణ రూపొందించుకొని ప్రణాళికబద్దంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా కుంటల అభివృద్ధి కోసం సంబంధిత అధికారుల సమన్వయంతో నిర్ధేశిత గడువులోగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.