జిల్లాలో ఆధార్ నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆధార్ నవీకరణ ప్రక్రియపై ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు, రెవెన్యూ, విద్య, పంచాయతీ, సంక్షేమ శాఖల అధికారులు, యు.ఐ.డి.ఎ.ఐ. అసిస్టెంట్ మేనేజర్, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ కార్డు పొంది 10 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు తమ ఆధార్‌కార్డును పూర్తి వివరాలతో నవీకరించుకోవాలని అన్నారు. ఆధార్ అప్‌డేట్ ద్వారా జీవన సౌలభ్యం సులభతరమవుతుందని, ఒకే దేశం ఒక రేషన్ కార్జు కార్యక్రమం క్రింద లబ్దిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చని, బ్యాంక్ ఖాతా తెరువడం తేలికవుతుందని తెలిపారు. దాదాపు 1000 ప్రభుత్వ పథకాలు / కార్యక్రమాల ప్రయోజనాల ఫలాలను లబ్టిదారులు పొందుతున్నారని, ఆధార్‌ను ఉపయోగించి మొబైల్ సిమ్ పొందడం సులభతరమవుతుందని, వివిధ స్కాలర్‌షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యమని, తప్పిపోయిన కటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయితే ఐ.టి. రిటర్న్ లను సులభంగా ఈ-వెరిఫై చేయవచ్చని తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పాఠశాలల్లో ఆధార్ అప్‌డేట్ కొరకు వారి తల్లి / తండ్రి బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుందని, 5 నుండి 18 సం॥ల వయస్సు గల బాలబాలికలకు అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశా వర్మర్ల ఆధ్వర్యంలో మొబలైజేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆధార్ అప్‌డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పంచాయతీ, సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆధార్ నవీకరణ కొరకు శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందించుకొని జిల్లాలో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని బ్యాంకులలో ఆధార్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బ్యాంక్ ఖాతాదారులకు మొబైల్ అప్‌డేట్‌తో పాటు అధార్ అప్‌డేట్ చేసే విధంగా అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నిత్యజీవితంలో జరిగే ప్రతి అంశానికి ఆధార్ అనుసంధానించబడి ఉంటుందని,
ప్రతి ఒక్కరు తమ పూర్తి వివరాలను ఆధార్ నవీకరణ ప్రక్రియ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలని తెలిపారు. ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు, బ్యాంకులతో పాటు ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మండలాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్భులు ఆధార్ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం ఆధార్ నమోదు ప్రక్రియకు సంబంధించిన గోడపతులను ఆవిష్కరించారు. ఆధార్ నవీకరణ సంబంధిత ఫిర్యాదులు, సలహాల కొరకు టోల్ ఫ్రీ నం. 1947, ఈ-మెయిల్ help@uidai.gov.in ద్వారా సంప్రదించవచ్చని, ఆన్‌లైన్‌లో https://myaadhar.uidai.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆధార్ నవీకరణ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా స్థాయి ఆధార్
పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ బి. శ్రీరాములు, సభ్యులు గౌతమ్ గోసాయి, ప్రతినిధి మహ్మద్ సుబాన్, ఈ.డి.ఎం. జి.సునిల్‌కుమార్, సీనియర్ మేనేజర్ టి.వెంకటస్వామి, సి.డి.పి.ఓ.లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.