MNCL : ఇంటర్మీడియట్‌ పరీక్షలు సజావుగా సాగేందుకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మధుసూదన్‌ నాయక్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శైలజతో కలిసి అధికారులతో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపైస మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 24 పరీక్ష కేంద్రాల ద్వారా జనరల్‌, ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో 6 వేల 910 మంది, ద్వితీయ సంవత్సరంలో 7 వేల 758 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని, ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగనున్నందున అధికారులు గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షల నిర్వహణ విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందు కోసం 25 ఫ్లయింగ్‌ సాగ్‌, 15 సిట్టింగ్‌ స్సాడ్‌ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయానికి విద్యార్థినీ, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు రూట్‌మాప్‌ రూపొందించుకొని బస్సులు నడిపించాలని, ఉదయం 6 గం॥ల నుండి పరీక్ష కేంద్రాల సంబంధిత రూట్లలో బస్సులు ఏర్పాటు చేయాలని, 8 గం॥ల లోగా పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా చూడాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యాశాఖ పరిధిలో ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని, పరీక్ష సమయంలో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ శాఖ అధికారులు పర్యవేక్షించాలని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య అధికారులు, సిబ్బందిని నియమించాలని, అవసరమైన మందులు, ఓ. ఆర్‌.ఎస్‌. ప్యాకెట్లు, హెల్త్‌ కిట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష అనంతరం పరీక్ష కేంద్రాల నుండి పత్రాలను డి.ఆర్‌.డి.సి. సెంటర్‌కు తరలింపు ప్రక్రియను పోస్టల్‌ అధికారులు పకడద్చంధీగా నిర్వహించాలని, టెలికాం/బి. ఎస్‌. ఎన్‌. ఎల్‌. అధికారులు పరీక్ష సమయం ఉదయం 8 గం॥ల నుండి మధ్యాహ్నం 1 గం.ల వరకు విద్యార్థుల హాజరు, గైర్హాజరు ఇతర సమాచారం నమోదు చేసేందుకు అరంతయం లేకుండా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సరఫరా చేయాలని, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలలో పరీక్షకు ముందు, పరీక్ష ముగిసిన తరువాత పారిశుద్ద్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని, కొవిడ్‌ వైరస్‌ నియంత్రణ దిశగా సానిిటైజేషన్‌ను చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, విద్యుత్‌, పంచాయతీ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post