MNCL : ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డిసెంబర్‌ 3, 4 తేదీలలో జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు మధుసూదన్‌ నాయక్‌, బి.రాహుల్‌తో కలిసి ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు నమోదు, దరఖాస్తు ఫారములు ఉంటాయని, ఓటర్లు తమ వివరాలను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత ఓటరు జాబితా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు బూత్‌ స్థాయి అధికారులు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. నూతన ఓటరు నమోదు చేసుకునేందుకు జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, 18 సం॥॥ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. నూతనంగా ఓటరు నమోదు కొరకు ఫారం-6, విదేశాలలో నివాసముంటున్న భారతీయులు (ఎన్‌. ఆర్‌. ఐ.) ఓటు నమోదు కొరకు ఫారం-6ఎ, ఓటరు కార్డుతో ఆధార్‌ కార్డు అనుసంధానం కొరకు ఫారం-6బి, ఓటరు జాబితాలో పేరు చేర్చడం / తొలగించడం కొరకు ఫారం-7, చిరునామా మార్చు / వివరాల సవరణ / ఓటరు కార్డు భర్తీ / వైకల్యం ఉన్న వ్యక్తుల గుర్తింపు కొరకు ఫారం-8 లను వినియోగించడంతో పాటు ఆన్‌లైన్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని అర్హత గల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా విసృత స్థాయి ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గోడప్రతులు, కరపత్రాలు, ఆటోలలో మైకుల ద్వారా, దినపత్రికలు, కేబుల్‌ ఛానళ్ళ ఇతరత్రా ప్రసార సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post