ప్రజల కంటి సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలలో 100 శాతం లక్ష్యాలను సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మిక తనిఖీ చేసి శిబిరం పనితీరు, రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 18 సం॥ల వయస్సు నిండిన అందికీ కంటి పరీక్షలు నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా 4౦ కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి శిబిరానికి ఒక బృందాన్ని నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 153 గ్రామపంచాయతీలు, 78 వార్లులో కంటి వెలుగు నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగిందని, 98 వేల 339 మంది పురుషులు, 1 లక్షా 10 వేల 825 మంది మహిళలు, 79 మంది ఇతరులకు పరీక్షలు నిర్వహించి రీడింగ్ అద్దాలు అవసరం ఉన్న 35 వేల 382 మందికి అందించడంతో పాటు 35 వేల 382 మందికి ప్రిస్కిష్నన్ అద్దాలు ఆర్దర్ చేసి 11 వేల 716 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. కంటి వెలుగు శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు, అవసరమైన వారికి రీడింగ్ అద్దాలను ఉచితంగా అందించడం జరుగుతుందని, కంటి సమస్య ప్రకారం ప్రిస్కిప్షన్
అద్దాల కొరకు ఆర్టర్ చేసి అందించడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు శిబిరం పరిధిలోని అర్హత గల ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి 100 శాతం లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా॥ అనిల్, కంటి వెలుగు వైద్యాధికారి డా॥ వేదశ్రీ, డి. ఈ.ఓ.లు తేజస్విని, లావణ్య, ఆప్తాల్మిస్ట్ స్వాతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.