జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల క్రింద ఉన్న వ్యవసాయ భూములకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చెన్నూర్ ఎత్తిపోతల పథకం క్రింద 10 టి.ఎం.సి.ల సాగునీటిని 90 వేల ఎకరాలకు అందించడం జరుగుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు క్రింద మూడు బ్యారేజీలు ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు కార్యచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం 1658 కోట్ల రూపాయలతో జీ.ఓ. ఆర్.టి. నం.133 క్రింద పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, పంపులు, పరికరాల విశ్లేషణ, పైప్‌లైన్లు, అనుసంధాన ఛానల్ సంబంధిత అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి పంప్‌హౌజ్ వద్ద గరిష్ట నీటి మట్టాలను ధృవీకరించిన తరువాత ప్రతిపాదిత ప్రదేశాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్పులు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో లిఫ్ట్-1, లిఫ్ట్-2, లిస్ట్-3 కొరకు సవరించిన భూసేకరణ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్‌లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లిఫ్ట్-1 ద్వారా మందమర్రి మండలం పొన్నారం, శంకర్‌పల్లి, జైపూర్ మండలం గంగిపల్లి ట్యాంక్‌ల వరకు నీరు విడుదల చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని, లిస్ట్-2 ద్వారా భీమారం మండలం ఆరెపల్లి, చెన్నూర్ మండలం ఆస్నాద్, రెడ్డిపల్లి ట్యాంక్‌లకు, లిఫ్ట్-3 ద్వారా కోటపల్లి మండలం శంకర్‌పూర్ ట్యాంక్‌లకు నీటిని విడుదల చేసేందుకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్ మండలంలో 31 వేల 947మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది. ఎకరాలు, కోటపల్లి మండలంలో 22 వేల 25 ఎకరాలు, భీమారం మండలంలో 10 వేల 606, జైపూర్ మండలంలో 19 వేల 987 ఎకరాలు, మందమర్రి మండలంలో 5 వేల 485 ఎకరాలు మొత్తంగా 90 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందు కొరకు భూ సేకరణ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, ప్రాజెక్టు అనుసంధాన కాలువలు, గ్రావిటీ పనులపై పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నీటి పారుదల శాఖ అధికారి శ్రావణ్, ఈ. ఈ.లు స్వామి, రాము, ఇంజనీరింగ్ విభాగం
అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.