MNCL : జిల్లాలో సమృద్ధిగా భూగర్భ జలాల లభ్యత : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జిల్లాలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయని, వ్యవసాయ, గృహ, ఇతరత్రా అవసరాలకు పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2019-20 భూగర్భ జలాల నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జల లభ్యత 67 వేల 724 హెక్టామీటర్లు ఉండగా అన్ని రకాల అవసరాలకు 27 శాతంతో 18 వేల 28 హెక్టామీటర్లు మాత్రమే వినియోగిస్తున్నారని, 47 వేల 834 హెక్టామీటర్ల మిగులు జలాలు ఉన్నాయని తెలిపారు. కమాండ్‌ ఏరియాలో 20 శాతం, నాన్‌ కమాండ్‌ ఏరియాలో 31 శాతంగా వినియోగం ఉందని, జిల్లాలో 18 మండలాలను 7 మైక్రోబేసిన్స్‌గా విభజించగా సేఫ్‌ కేటగిరిలో ఉన్నాయని, చెన్నూర్‌, జైపూర్‌లను సెమీ క్రిటికల్‌ మండలాలుగా గుర్తించడం జరిగిందని, బేసిన్స్‌ వారిగా మిగిలిన 16 మండలాలు సేఫ్‌గా ఉన్నాయని, జిల్లాలో 4 వేల 16 చదరపు కిలోమీటర్లకు గాను 27 శాతం భూగర్భ జల వినియోగం జరుగుతుందని తెలిపారు. 2019-20 అంచనా 95 వేల 121 హెక్టార్లకు గాను 81 వేల 201 హెక్టార్లు వినియోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు. పంటల సాగు కొరకు పొదుపుగా వాడుతూ 20 వేల నుండి 40 వేల బోర్ల వరకు వేసుకోవచ్చని అంచనా వేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు పి. శ్రీనివాస్‌బాబు, సంబంధీత అధికారులు తదితరులు
పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post