MNCL : జి.ఓ. నం.76 ద్వారా పేద ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వం : ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌

ప్రభుత్వం జి.ఓ. నం.76 ద్వారా సింగరేణి స్థలాలలో నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 5వ విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు మాట్లాడుతూ సింగరేణి ఖాళీ స్థలాలలో నివాసం ఉంటున్న వారిని జి.ఓ. నం.76 ద్వారా భూముల క్రమబద్దీకరణ చేసి యజమానులను చేయడం జరుగుతుందని, ఏండ్లుగా నివాసం ఉంటున్న వారు, సింగరేణి రిటైర్‌ కార్మికులు నివాసం ఉంటున్న ఇండ్లను జి.ఓ.నం. 76 నిబంధనల మేరకు ప్రభుత్వం తక్కువ ధరకే అందించడం జరుగుతుందని అన్నారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ ప్రాంతంలో మొదటి విడతలో 1 వేయి 32 పట్టాలు, రెండవ విడతలో 367 పట్టాలు, మూడవ విడతలో 356 మందికి పట్టాలు, నాలుగవ విడతలో 282 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, 5వ విడతలో 242 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకొని తిరస్మరించబడిన వారు, నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు తగిన ఆధారాలతో తహళశిల్దార్‌ కార్యాలయంలో, వార్డు పరిధిలోని ప్రజాప్రతినిధులను సంప్రదించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందు కొరకు ఏప్రిల్‌ 1 నుండి జూన్‌ 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ఇంతకు ముందు 2014 జూన్‌ 2 వరకు పరిమితి ఉండేదని, ప్రస్తుత జి.ఓ. ప్రకారం 2020 జూన్‌ 2వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగిందని, ఈ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 100 గజాల లోపు ఉచితం, 101 నుండి 500 గజాల లోపు 25 రూపాయలు, 501 నుండి 1000 గజాల వరకు గజానికి 250 రూపాయల చొప్పున నివాస భూములకు ధర నిర్ణయించడం జరిగిందని, కమర్షియల్‌ కాటగిరీ క్రింద 500 గజాల లోపు గజానికి 100 రూపాయలు, 501 నుండి 1000 గజాల లోపు 500 రూపాయల చొప్పున ధర నిర్ణయించడం జరిగిందని, సాధారణ ధరలకు ప్రభుత్వం అర్హులైన లబ్బిదారులకు అందించడం జరుగుతుందని, కుటుంబ రక్షణ, సంక్షేమానికి అహర్నిశలు పాటే మహిళల పేరిట పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. రామకృష్ణాపూర్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకొని ఉనిఖి కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో జి.ఓ. నం.76 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఇతరత్రా అన్ని ఒకే చోట లభించే విధంగా దాదాపు 7 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సమీకృత మార్కెట్‌ నిర్మించడం జరుగుతుందని, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25 కోట్ల రూపాయలు
మంజూరు చేయడం జరిగిందని, ఇందులో సి.సి. లోద్డు, మురుగు కాలువలు, బి.టి. రోడ్డు, వీధి దీపాలు, అంబేద్మర్‌ పార్క్‌ ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. 3, 4 వార్డులకు కలిపి కె.సి. ఆర్‌. మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లు, అంతర్గత సిమెంట్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని, 2 కోట్ల 76 లక్షల రూపాయలతో 67 అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, ఇంటింటికి చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జి.ఓ. నం.76లో భాగంగా 5 వేల 22 దరఖాస్తులు రాగా 3 వేల 740 అభ్యర్థులను అర్హులుగా గుర్తించగా 1 వేయి 282 దరఖాస్తులను వివిధ కారణాల వలన తిరస్కరించడం జరిగిందని, 5 దశలలో 2 వేల 346 పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 585 డి.డి. చెల్లించవలసి ఉందని, 486 రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉందని, 100 చదరపు గజాల లోపు ఉన్న 322 లబ్దిదారులకు రిజిస్టేషన్‌ చేయడం జరుగుతుందని, 1 వేయి 393 రిజిష్ట్రేషన్‌ చేయవలసి ఉందని, 7 రోజుల లోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 2వ విడత దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నిబంధనల మేరకు చదరపు గజాల ప్రకారం తక్కువ ధరకే భూములు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డి.డి. చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ వైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post