MNCL : టెట్‌ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్దం : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్న టెట్‌ పరీక్ష నిమిత్తం అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌లో ఇన్‌చార్జ్‌ డి.సి.పి. అఖిల్‌ మహాజన్‌, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 12వ తేదీన నిర్వహించనున్న టెట్‌ పరీక్షలో భాగంగా మొదటి పేపర్‌కు 47 కేంద్రాలు (20 ప్రభుత్వ సంస్థలు, 27 ప్రైవేట్‌ సంస్థలు), రెండవ పేపర్‌కు ౩4 కేంద్రాలు (11 ప్రభుత్వ సంస్థలు, 23 ప్రైవేట్‌ సంస్థలు) ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరీక్షలలో మొదటి పేపర్‌కు 11 వేల 161 మంది, రెండవ పేపర్‌కు 7 వేల 932 మంది హాజరు అవుతారని, మొదటి పేపర్‌ ఉదయం 9.30 గం॥ల నుండి మధ్యాహ్నం 12 గం॥ల వరకు, రెండవ పేపర్‌ మధ్యాహ్నం 2.30 గం॥ల నుండి సాయంత్రం 5 గం॥ల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష సమయం దాటి ఒక్క నిమిత్తం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగదని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో పేపర్లు భద్రపరిచే స్ర్రాంగ్‌ రూమ్‌ నిర్వహణ ఉంటుందని, పరీక్ష ముగిసే వరకు పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. స్టాంట్‌ రూమ్‌ నుండి పేపర్లు పరీక్ష రోజున 9 రూట్ల ద్వారా కేంద్రాలకు చేరుకుంటాయని, పరీక్ష అధికారులు రూట్‌ అధికారులు ఫ్లయింగ్‌ స్పాడ్‌ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచే విధంగా చూడాలని తెలిపారు. వేసవి ఉష్టోగ్రత కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, పరీక్ష కేంద్రాలలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, నిరంతర విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలని, పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అధికారులు బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని, పేపర్లు పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. టెట్‌ పరీక్షకు వాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌ లైన్‌ నం.08736-252420 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు,
సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post