MNCL : తెలంగాణకు హరితహారం లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌

ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 8వ విడత కార్యక్రమ నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు సిద్దంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో తెలంగాణకు హరితహారం, దళితబంధు, వరిధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం 8వ విడత కార్యక్రమం నిర్ణీత సమయానికి ప్రారంభించి ఆగస్టు మాసాంతం వరకు పూర్తయ్యే విధంగా కార్యచరణ రూపొందించుకొని ‘ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పురపాలక సంఘాలు, గ్రామపంచాయతీలలో ఖాలీగా ఉన్న ప్రభుత్వ స్థలాలలో మొక్కలు నాటే విధంగా చూడాలని, నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, తూముల వెంట విసృతంగా మొక్కలు నాటాలని, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్‌ ప్రకృతి వనాలు (గౌండింగ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మే 7వ తేదీ లోగా హరితహారం సంబంధిత జిల్లా ప్రణాళిక సిద్దం చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. దళితుల అభ్యున్నతి, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకంపై నియోజకవర్ణాల వర్ధాల వారిగా మంజూరైన యూనిట్లతో పాటు ప్రత్యేక మండలాలను ఎంపిక చేసి దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని, వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేసి నివేదిక అందించాలని తెలిపారు. వానాకాలం పంట సాగు ప్రణాళికలో భాగంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పెసరు పంట సాగు వల్ల దిగుబడితో పాటు భూసారం పెంపొందుతుందని రైతులకు తెలియజేయాలని, కంది పంట సాగు పెంచాలని రైతులు ఎరువులు మోతాదుకు మించి వాడకుండా అవగాహన కల్పించడంతో పాటు సేంద్రియ పద్దతిలో సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని తెలిపారు. వరి పంట డైరెక్ట్‌ సీడ్స్‌ వేసే విధానం పై అవగాహన కల్పించాలని, వ్యవసాయ విస్తరణాధికారులు తమ పరిధిలోని రైతువేదికలో ఉండి విధులు నిర్వహించే విధంగా అదేశించి, రైతువేదికలను వందశాతం ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు, రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సంబంధిత అధికారులు కొనుగోలు ప్రక్రియపై పర్యవేక్షించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం నిర్ధేశిత లక్ష్యాలను అధిగమించామని, ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ఆయా శాఖలకు కేటాయించడం జరిగిందని, మొక్కల సంరక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, విద్యా సంస్థలలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు యూనిట్లు [గ్రౌండింగ్‌ చేయడంతోపాటు అవగాహన సదస్సులు నిర్వహించి వివరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల సౌకర్యార్థం రైతువేదికలో అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి , జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.

Share This Post