MNCL : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి : జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి. మధుసూదన్‌ నాయక్‌, బి.రాహుల్‌, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు దాసరి వేణు, శ్యామలాదేవి, ఎ.సి.పి. తిరుపతిరెద్దితో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, జూన్‌ 2 నుండి 22వ తేదీ వరకు 20 రోజుల పాటు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కొరకు ప్రభుత్వం 2 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

3వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవంలో భాగంగా రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, విద్యుత్‌ దీపాలతో అలంకరించి వ్యవసాయ రంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతి తెలిసే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు జేసి రైతుకు కలిగిన లబ్బిని వివరించాలని, రైతుబంధు నాయకులు, సర్బంచ్‌లు, ఎం.పి.టి.సి.లు, జెడ్‌.పి.టి.సి.లు, మండలాధ్యక్షులు, పి.ఎ.సి.ఎస్‌. చైర్మన్లు, వ్యవసాయ, ఉద్యానవన, మండల స్థాయిలో ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొనాలని తెలిపారు.

4వ తేదీన నురక్షా దినోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి స్నేహపూర్వక విధానం, సమర్థవంతమైన సేవలు, పోలీసు శాఖలోజరిగిన సంస్కరణలు, సాధించిన ఘనత, విజయాలను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, పెట్రోలింగ్‌ కార్లు, బ్లూకోట్స్‌, ఫైర్‌ వెహికల్స్‌ లతో ర్యాలీ, సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బందితో సభ నిర్వహించాలని తెలిపారు.

5వ తేదీన తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవయో భాగంగా విద్యుత్‌ రంగంలో సాధించిన గుణాత్మక మార్పులపై ప్రతి గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, సాధించిన విజయాలతో బుక్‌లెట్‌ తయారు చేసి పంపిణీ చేయాలని, తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్‌ వ్యవస్థ బలోపేతం, సింగరేణి కార్మికులతో సమావేశాలు జరిపి బోనస్‌, కారుణ్య నియామకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరించాలని, కార్మికులతో సామూహిక భోజనాలు చేయాలని తెలిపారు.

6వ తేదీన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో భాగంగా పారిశ్రామిక వాడలు, ఐ.టి. కారిడార్లలో సభలు నిర్వహించి పారిశ్రామిక రంగంలో జరిగిన విప్లవాత్మక మార్పులు, సాధించిన ప్రగతి, టి.ఎస్‌.-ఐ.పాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతుల మంజూరు అంశాలను వివరించాలని, నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహపంక్తి భోజనాలు చేయాలని తెలిపారు.

7వ తేదీన సాగునీటి దినోత్సవంలో భాగంగా సాగునీటి రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతిని వివరిస్తూ నియోజకవర్గంలో 1 వేయి మందితో సభలు నిర్వహించాలని, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, సాగునీటి సరఫరా అంశాలపై వివరించాలని, రైతులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొనాలని తెలిపారు.

8వ తేదీన ఊరూరా చెరువుల పండుగో భాగంగా గ్రామపంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పెద్ద చెరువువద్దకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా వెళ్ళి సాయంత్రం 5 గం॥లకు చెరువులపండుగ నిర్వహించాలని, చెరువు గట్టుపై ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలని, ఇరిగేషన్‌లో వచ్చిన ప్రగతి, పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్భ జలాల పెరుగుదల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్ట మీద సహపంక్తి భోజనాలు చేయాలని తెలిపారు.

9వ తేదీన తెలంగాణ నంక్షేమ సంబురాలులో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ లబ్దిదారులతో 1 వేయి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలని, కేటాయించిన నిధులు, ఫలితాల గురించి వివరించాలని, నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున గొల్లకుర్మలకు గొరైల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

10వ తేదీన తెలంగాణ సుపరిపాలన దినోత్సవయో భాగంగా జిల్లా కేంద్రాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రస్తావించాలని, నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలని, వివిద శాఖల పున:వ్యవస్తీకరణ ద్వారా అందుతున్న మెరుగైన సేవలపై వివరించాలని తెలిపారు.

11న తెలంగాణ సాహిత్య దినోత్సవంలో భాగంగా తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులతో కవి సమ్మేళం ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వం, సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితా కార్యక్రమం నిర్వహించాలని, ఈ కవితలతో కవితా సంకలనం ప్రచురించాలని తెలిపారు.

12న తెలంగాణ రన్‌లో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గం॥లకు పోలీసు శాఖ నేతృత్వంలో, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ భాగస్వామ్యంతో తెలంగాణ రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రత్యేకంగా బెలూన్స్‌ ఎగురవేయాలని తెలిపారు.

13న తెలంగాణ మహిళ నంక్షేమ దినోత్సవయో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సెర్చ్‌ సిబ్బంది, మహిళా సర్పంచ్‌లు, చైర్‌పర్సన్లు, ఇతరులు 1 వేయికి తగ్గకుండా మహిళా సదస్సు నిర్వహించాలని, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వివరించాలని, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఫించన్లు, కళ్యాణలక్ష్మీ, ఆరోగ్యలక్ష్మీ కె.సి.ఆర్‌. కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్‌ తదితర అంశాలన్నింటినీ ఘనంగా పేర్కొనాలని, ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలని తెలిపారు.

14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కె.సి.ఆర్‌. కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, సి.ఎం. ఆర్‌. ఎఫ్‌. లబ్బిదారులు, వైద్య-ఆరోగ్య సిబ్బంది, నూతన మెడికల్‌, నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలల విద్యార్థులను ఆవ్వానించి సభ నిర్వహించాలని, వైద్య-ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతి వివరించాలని, వైద్య కళాశాలలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, కంటి వెలుగు, మాతా శిశు కేంద్రాలు తదితరాలపై పూర్తిగా వివరించాలని, ఉత్తమ సేవలు అందించిన ఆశావర్కర్‌, ఎ.ఎన్‌.ఎం. స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, వైద్యులను సన్మానించి అవార్డులు అందించాలని తెలిపారు.

15న తెలంగాణ వల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలని, పల్లెప్రగతి ద్వారా వచ్చిన నిధులు, సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ది, గ్రామాలలో కల్పించిన మౌళిక వసతుల వివరాలు, పారిశుద్ధ్యం, పచ్చదనం, జాతీయ స్థాయిలో సాధించిన అవార్డుల గురించి తెలియజేయాలని, గ్రామంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, బ్రౌచర్లు రూపొందించి పంపిణీ చేయాలని, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును వివరించాలని, ఉత్తమ గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉత్తమ మండలాల ఎం.పి.పి.లను సన్మానించాలని తెలిపారు.

16న తెలంగాణ వట్టణ ప్రగతి దినోత్సవంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలని, పట్టణ ప్రగతి, వివిధ సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ది పట్టణంలో కల్పించిన మౌళిక వసతులు, మెరుగుపడిన తీరును వివరించాలని, సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్‌ యార్డులు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల నిర్మాణం 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపు, పట్టణ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధిపై ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, బ్రౌచర్లు తయారు చేసి పంపిణీ చేయాలని తెలిపారు. టి.ఎస్‌. -బి.పాస్‌, జి.ఓ.58, 59ల ద్వారా ప్రజలకు కలిగిన లబ్బిని వివరించాలని, ఉత్తమ మున్సిపాలిటీల వార్డు కౌన్సిలర్లు, చైర్మన్లు ఉ ద్యోగులను సన్మానించాలని తెలిపారు.

17న తెలంగాణ గిరిజనోత్సవంయో భాగంగా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి గిరిజన గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి వివరించాలని, తండాలకు, గూడాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించడం, విద్య, ఉద్యోగాలలో ఎస్‌.టి.లకు రిజర్వేషన్‌ 10 శాతం పెంపు, సమ్మక్క-సారక్క జాతర నిర్వహణ తీరు, వివిధ జాతరలకు (ప్రభుత్వం మంజూరు చేస్తూ నిధుల, తీసుకునే చర్యలను వివరించాలని తెలిపారు.

18న తెలంగాణ మంచినీళ్ళ పండుగలో భాగంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్‌ భగీరథ ఫిల్టర్‌ బెడ్స్‌, వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల సందర్భన కార్యక్రమం నిర్వహించి నీటి శుభత, ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా తీరును వివరించాలని, గ్రామ స్థాయిలో మహిళలతో సభ నిర్వహించి మిషన్‌ భగీరథ అమలుకు ముందు పరిస్థితి, ప్రస్తుతం నల్లాల అందుతున్న స్వచ్చమైన సురక్షితమైన నీటి సరఫరా తీరును వివరించాలని తెలిపారు.

19న తెలంగాణ హరితోత్సవంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమం, అటవీ శాఖ ఆధ్వర్యంలో పచ్చదనాన్ని పెంచడానికి జరిగిన కృషి, అడవుల పున:రుద్దరణ కొరకు చేపట్టిన చర్యలు, ఫలితాల గురించి వివరించాలని, ప్రతి గ్రామంలో మాస్‌ ప్లాంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.

20న తెలంగాణ విద్యాదినోత్సవయో భాగంగా మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పనులు పూర్తి చేసుసుకున్న పాఠశాలల ప్రారంభోత్సవం నిర్వహించాలని, పిల్లలకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో, పూలతో అందంగా అలంకరించాలని, విద్యారంగంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి, 1 వేయి 1 గురుకులాల స్థాపన, విశ్వవిద్యాలయాలు, వైద్య, నర్సింగ్‌, పారామెడికల్‌, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటును వివరించాలని తెలిపారు.

21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవయో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరించాలని, వేద పారాయణం, ప్రత్యేక ప్రార్ధనలు, ప్రముఖ క్షేత్రాల్లో భక్తి, సాంస్ఫృతిక కార్యక్రమాలు, హరికథలు, పురాణ ప్రవచనాలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని, శాసననభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని తెలిపారు.

22న అమరుల సంన్మరణ లో భాగంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో ఉదయం 11 గం॥లకు అందరు సమావేశమై అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించాలని, అమరుల సంస్మరణ తీర్మానం చేయాలని, మంత్రులు, శాసనసభ్యులు తమ పరిధిలో ఉదయం అమరవీరుల స్ఫూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించాలని, కళాకారులతో ర్యాలీ నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post