దేశ సంస్కృతి – మన దేశభక్తిని చాటేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు జిల్లాలోని కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి జిల్లా అధికారులతో వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వేడుకలను ప్రారంభిస్తారని, 9న జిల్లాలో వేడుకలు ప్రారంభమవుతాయని, ఇంటిపై జాతీయ పతాక ఆవిష్కరణలో అనుసరించవలసిన నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 10వ తేదీన వననమహోత్సంలో మొక్కలు నాటడం, ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటు, 11న ఫ్రీడమ్ రన్, 12న జాతీయ సమైఖ్యత రక్షా బంధన్, 19న విద్యార్థినీ, విద్యార్థులు, ఉద్యోగులతో జెండా, ప్లకార్డులతో ర్యాలీ, గ్రామపంచాయతీలు, పట్టణాల పరిధిలోని మైదానాలలో త్రివర్జంతో కూడిన బెలూన్ల విడుదల, 14న జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ సాంసృతిక సారథి కళాకారుల సమన్వయంతో జానపద కళా ప్రదర్శన, సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో బాణాసంచా కాల్చుట, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, 16న తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం సమయంలో జిల్లా కేంద్రంలో కవి సమ్మేళనం, 17న జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరాల నిర్వహణ, 18న ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడల నిర్వహణ, 19న ఆసుపత్రులు, వృద్ధాశమాలు, అనాథ శరణాలయాలు, జైళ్ళలో పండు, సీట్లు పంపిణీ, 20న దేశభక్తి చాటేలా మహిళలకు రంగోలి కార్యక్రమం, 21న గ్రామ, మండల, పురపాలక, జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, పట్టణాలలో మున్సిపల్ కమీషనరు, కౌన్సిలర్లు బాధ్యతగా తీసుకోవాలని, గ్రామస్థాయిలో టాం-టాం చేయాలని, పట్టణ స్థాయిలో ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి విసృత ప్రచారంతో పాటు స్థానిక కేబుల్ ఛానళ్లలో ప్రసారం చేయించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, రైస్‌మిల్లుల సంఘం అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.