పండుగలను ప్రజలందరు కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఈ నెల 23న ప్రారంభం కానున్న రంజాన్ మాసం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమితో కలిసి పోలీసు శాఖ అధికారులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ కమీషనరు, విద్యుత్, కమర్షియల్ టాక్స్, నీటి పారుదల శాఖల అధికారులు, మసీదు కమిటీ పెద్దలు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ప్రజలందరు కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో మసీదులలో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, రాత్రి 11 గం1ల వరకు అందరి సమన్వయంతో పండ్ల దుకాణాలు నిర్వహించుకోవచ్చని, రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, గ్రామాలలో పంచాయతీ
రాజ్, పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, మసీదులు, ఈడ్ద్గాల వద్ద విద్యుత్ దీపాల ఏర్పాట్లు, మరమ్మత్తు చర్యలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో రంజాన్ పండుగ సందర్భంగా బట్టల పంపిణీ, ఇష్పార్ విందు కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత తహశిల్దార్లకు తగు సూచనలు, సలహాలు అందించి కార్యక్రమాలు శాంతియుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పండుగ సందర్భంగా దుకాణాలను నిర్వహించే సమయం, ఆదివారం నిర్వహణపై కమర్షియల్ టాక్స్ అధికారులు అవకాశం కల్పించాలని తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం అందించే గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమం సామరస్యంగా జరిగే విధంగా అధికారులు, ముస్లిం
మత పెద్దలు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్.డి.ఓ.లు వేణు, శ్యామలాదేవి, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి
రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి స్టేషన్ హౌజ్ అధికారులు వెంకటేష్, వి.రాజు, మహేందర్‌రెడ్డి, మసీదు కమిటీ పెద్దలు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.